ఆంధ్రప్రదేశ్‌

ఫేస్‌బుక్ మోసగాడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, జూలై 15: అమ్మాయి పేర ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి, లైక్స్‌తో వంచించి, మాయమాటలతో ఎరవేసి యువకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలుచేసిన మాయగాడిని కడప జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన నాగభూషణంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. మైదుకూరు రూరల్ సిఐ నాగభూషణం, ఎస్‌ఐ రాజగోపాల్ శుక్రవారం ఫేస్‌బుక్ మాయగాడి వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ఖాజీపేటకు చెందిన నరసింహ వరప్రసాద్ జూన్ 20వ తేదీ బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన విశాఖకు చెందిన అనుశ్రీతో నిత్యం ఛాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలో అనుశ్రీ చెప్పినట్లు బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేశాడన్నారు. డబ్బు తిరిగి చెల్లించమనడంతో అవతలి నుంచి సమాధానం రాకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విచారించగా అసలు విషయం వెలుగుచూసిందన్నారు. విశాఖపట్టణానికి చెందిన కల్యాణి కుమారుడు గొర్ల నాగభూషణం అనుశ్రీ పేర ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి పలువురు యువకులతో పరిచయం పెంచుకున్నట్లు వారు తెలిపారు. గొంతుమార్చి ఫోన్‌లో అమ్మాయిలా మాట్లాడుతూ వరప్రసాద్‌ను మభ్యపెట్టాడన్నారు. ఏడాది కాలంగా అనుశ్రీ పేరుతో తప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి పలువురు యువకులకు రిక్వెస్ట్ పంపి కన్ఫం చేసుకుని స్నేహితునిగా, లవర్‌గా మాట్లాడుతూ ఎలాంటి అనుమానం రాకుండా వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. తన తల్లి గొర్ల కల్యాణి ఎస్‌బిఐ ఖాతా నెంబర్ ఇచ్చి సుమారు 50 మంది నుంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేశాడన్నారు. ఖాజీపేటకు నరసింహ ద్వారా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో రూ.30 వేలు అకౌంట్‌లో వేయించుకున్నాడన్నారు. డబ్బు తిరిగి ఇమ్మని అడిగితే పోలీసులకు చెప్పి వేధిస్తున్నాడని కేసుపెడతానని బెదిరించాడన్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు, విజయనగరం, కరీంనగర్, హైదరాబాద్, శ్రీకాకుళం, రాయచోటి, అమలాపురం పట్టణాలకు చెందిన యువకులను మోసం చేసినట్లు అంగీకరించాడన్నారు.

మందుపాతరల కలకలం
మన్యంలో పోలీసుల తనిఖీలు

చింతూరు, జూలై 15: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు గుర్తించి, పేల్చివేశారు. చింతూరు మండలం ఏడు గుర్రాలపల్లి, పేగ గ్రామాల మధ్య చెట్ల కింద మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. శుక్రవారం పోలీసులు కూంబింగ్ సమయంలో ఈ మందుపాతరలను గుర్తించారు. ప్రతి శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆ సమయంలోనే పోలీసులను మట్టుబెట్టాలని మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. శుక్రవారం పోలీసు బలగాలు సంతను చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్న సమయంలో సమీప ప్రాంతంలోని రెండు చెట్ల కింద అమర్చిన మందుపాతరలను గుర్తించారు. ఇందులో ఒక మందుపాతర అనుకోకుండా పేలిపోయింది. మరో మందుపాతరను నిర్వీర్యం చేయడానికి కాకినాడ నుండి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. దాన్ని నిర్వీర్యంచేసే అవకాశం లేకపోవడంతో ఎఎస్పీ శే్వత, ఒఎస్‌డి ఫకీరప్ప పర్యవేక్షణలో బాంబ్ స్క్వాడ్ మందుపాతరలను పేల్చివేసింది. దీంతో పెనుముప్పు తప్పినట్టయింది. ఈ తనిఖీలో సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గజేంద్రకుమార్, సిఆర్‌పిఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇలావుండగా ఏడుగుర్రాలపల్లి వారాంతపు సంత సమీపంలో మావోయిస్టులు శుక్రవారం కరపత్రాలను వదిలివెళ్లారు. ఈ కరపత్రాల్లో మిషన్ 2016ను ఆపివేయాలని, బూటకపు ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు కరపత్రాల్లో వారు పేర్కొన్నారు.