ఆంధ్రప్రదేశ్‌

అవినీతిలో ముందున్న ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1గా నిలిచిందని ఎపి కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. అవినీతి రహిత రాష్ట్రంగా పేరు సంపాదించినప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు విదేశీ విహారాలు చేసినంత మాత్రాన పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రారని ఆయన తెలిపారు. రష్యా, కజెకిస్తాన్ విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్‌లో రబ్బర్, మెరైన్ పరిశ్రమల స్థాపనకు కొన్ని పరిశ్రమలు ముందుకు వచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం లేదని, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు పరిశ్రమల స్థాపనతో వారి భూమి విలువ పెరుగుతుందనే భ్రమలో పడి పంటలు వేయడమే మానేశారని దీంతో రైతులు, రైతు కూలీలకు ఉపాధి కరువైపొతుందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు అయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీపై వత్తిడి ఎందుకు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాల ఆదాయ వనరుల రాయితీలు సమకూరుతాయని ఆయన తెలిపారు. లోగడ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏ అకౌంట్స్ కూడా సక్రమంగా లేవని ‘కాగ్’ తేల్చిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం మహమ్మారిని ఏరులై పారిస్తున్నారని రామచంద్రయ్య విమర్శించారు.