బిజినెస్

టెక్స్‌టైల్ రంగంలో కోటి మందికి ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 16: దేశ వ్యాప్తంగా టెక్స్‌టైల్ రంగంలో కోటి మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 6 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందని ఆయన చెప్పారు. చైనాలో జరిగిన జి-20 దేశాల సదస్సులో పాల్గొన్నాక హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ శనివారం మీడియాతో మాట్లాడుతూ 2030 సంవత్సరం లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలని జి-20 సభ్యదేశాలు నిర్ణయించాయన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఐటి, పబ్లిక్, సర్వీసు సెక్టార్‌లను పెంచుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. జి-20 దేశాల్లో భారత్ అన్ని రంగాల్లోనూ ముందున్నదన్నారు. రోడ్లు, రైల్వేల్లో ఎఫ్‌డిఐలు పెంచామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫార్మల్ సెక్టార్‌లో ఉన్న వారిలో 4 కోట్ల 70 లక్షల మందికి ఇఎస్‌ఐసి, పిఎఫ్ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పగానే జి-20 ప్రతినిధులు కరతాళధ్వనులు చేశారని చెప్పారు. ఈ సదస్సులో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంపైనే చర్చించామన్నారు. స్టార్టప్ ఇండియా పథకం కింద టెక్స్‌టైల్ రంగంలో కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించిందని, ఇందులో 75 శాతం మంది మహిళలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకూ ప్రాధాన్యం ఇస్తామని, మేక్ ఇన్ ఇండియా వేగంగా జరుగుతున్నదని, 18 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా ఐటిఐ అప్రెంటీస్ సీట్లను 1.9 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, కేంద్రం ఒక్కో విద్యార్థికి 7 వేల రూపాయల స్ట్ఫైండ్ ఇస్తుందని తెలియజేశారు.
రాష్ట్రానికి మన్‌రేగా నిధులు..
తెలంగాణకు మన్‌రేగా పథకం కింద వ్యవసాయ కార్మికుల కోసం భారీగా నిధులు విడుదల చేశామని దత్తాత్రేయ తెలిపారు. కరవు సహాయం కింద గత 2015-16 సంవత్సరంలో 1,824 కోట్ల రూపాయలు ఇచ్చామని, ప్రస్తుత 2016-17 సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,243 కోట్ల నిధులు ఇచ్చామని, ఇంకా ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, 14వ ఫైనాన్స్ కమిషన్ కింద తెలంగాణ గ్రామ పంచాయతీలకు 580 కోట్లు విడుదల చేశామన్నారు.