రాష్ట్రీయం

‘హారతి’కి వర్షం అడ్డంకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కృష్ణా నదికి గోదావరి మాదిరిగా నిత్య హారతి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ హారతిని విజయవాడలో కాకుండా ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి, కృష్ణానది సంగమ ప్రదేశంలో ఇవ్వాలని నిర్ణయించారు. ముందు ఈ హారతిని ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు.
అయితే అక్కడ పుష్కర పనులు ప్రారంభం కాకపోవడం వల్ల హారతిని ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మనసు మార్చుకుని వెంటనే హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఈమేరకు ముహూర్తం నిర్ణయించారు. సరిగ్గా అదే సమయానికి నదీ సంగమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌లో నదీ సంగమ ప్రాంతానికి రావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక పోవడంతో ఆయన రాలేకపోయారు. దీంతో హారతి కార్యక్రమం వాయిదాపడింది.

చిత్రం.. విజయవాడలో సోమవారం సాయంత్రం సుమారు గంట పాటు కురిసిన వర్షానికి బందరు రోడ్డులో వరదలా పారిన నీరు