రాష్ట్రీయం

పోలీసులకు కొత్త యూనిఫాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: జాతీయ స్ధాయిలో అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు ఒకే యూనిఫారం ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అన్నిరాష్ట్రాలు అంగీకరిస్తే ముదురు గోధుమ రంగు ప్యాంటు, క్రీమ్ రంగు చొక్కాను పోలీసు యూనిఫాం పద్ధతిని ఆమోదిస్తామని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
ఈమేరకు హోంశాఖ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలకు లేఖ రాసింది. బ్యూరో ఆఫ్ పోలీసు రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఈ విభాగం కొత్త పోలీసు యూనిఫాం డిజైన్‌ను జాతీయ డిజైన్ సంస్ధ, జాతీయ డిజైన్ బిజినెస్ ఇంక్యుబేటర్ సంస్ధల సహాయంతో రూపొందించింది. పోలీసు టోపీపై పోలీసు అని రాసి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ ముందుగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే సంస్ధల డైరెక్టర్ జనరల్స్‌తో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది.
కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు రాసిన లేఖలో దేశమంతా పోలీసులకు ఒకే యూనిఫాం ఉండాలనే ప్రతిపాదనకు మీరు అంగీకరిస్తారా , ఒక వేళ అంగీకరించినట్లయితే, తాము ప్రతిపాదించిన యూనిఫాంకు సమ్మతమేనా లేక మార్పులపై సూచనలు చేస్తారా అని అడిగింది. ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఆగస్టు 31వ తేదీలోగా తెలియచేయాలని కేంద్రం కోరింది.