తెలంగాణ

శరవేగంగా కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ ఒప్పందాలు పూర్తి చేస్తారు. 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసేలా సిద్ధమైన ప్రణాళికను నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. కార్యాచరణపై విస్తృతంగా చర్చించి, 18నెలల రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై సంబంధిత ఏజెన్సీలు ఐడిసి కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాయ. రిజర్వాయర్ల నిర్మాణ స్థలాన్ని ఇప్పటికే ఖరారు చేసినందున ఏజెన్సీలు తమ క్యాంప్‌లను ఏర్పాటు చేసుకొని అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి పనులు ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వారంలో లేబర్ క్యాంపులు, ఇతర సన్నాహాలు పూర్తి చేయాలన్నారు. దీనికి ఏజెన్సీ ప్రతినిధులు అంగీకరించారు. కాంట్రాక్టు సంస్థల అగ్రిమెంట్ల ప్రక్రియ ఐదు రోజుల్లో ముగించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మంగళవారం మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ దగ్గర క్యాంప్‌లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని మంత్రి కోరారు. కాళేశ్వరం బారేజీలు, పంపు హౌజ్‌ల నిర్మాణం వెనువెంటనే చేపట్టాలని కోరారు. ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ఆయా పనులను పర్యవేక్షించాలని ఈఎన్‌సి సి మురళీధర్‌రావు, కాళేశ్వరం, ప్రాణహిత సిఇలు ఎన్ వెంకటేశ్వర్లు, హరి రామ్‌లను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, సెంట్రల్ డిజైన్ల సిఇ నరేందర్‌రెడ్డి, ఇఎన్‌సిలు మురళీధర్‌రావు, ఇరిగేషన్ ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
chitram...
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కెసిఆర్ (పాత చిత్రం)