రాష్ట్రీయం

కోర్టుకు ఐసిస్ సానుభూతిపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న ముగ్గురు ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ ముగిసింది. మంగళవారం వారిని ఎన్‌ఐఏ అధికారులు నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. గత నెల 28న నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌ఐఏ, నగర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌తో 11 మందిని అరెస్టు చేశారు. వీరిని విచారించి ఆరుగురిని వదిలిపెట్టారు. ఐదుగురు సానుభూతిపరులను రెండు వారాల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. వీరి విచారణలో లభించిన సమాచారంతో నగరంలోని బండ్లగూడలో మరో ఇద్దరు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. నియామతుల్లా, అతావుల్లా రహ్మాన్‌ను వారం రోజులు, ఇబ్రహీం యజ్దాని, ఇమ్రాన్‌లను మరో వారం కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు.
అయితే వీరిని ఈనెల 19న కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశాల మేరకు వీరిని మంగళవారం ఎన్‌ఐఏ అధికారులు నాంపల్లి కోర్టుకు హాజరుపరచారు.ఇదిలావుండగా కుట్ర పేలుళ్ల కీలక సూత్రధారి అతావుల్లా రహ్మాన్‌ను మరో వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ కోరింది. రహ్మాన్ మత బోధనలతో యువతను ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించేవాడని ఆరోపణలున్నాయి. ఈ మేరకు అతనిని ఢిల్లీ తీసుకెళ్లి విచారించేందుకు కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ‘ఐసిస్ తరఫున పనిచేయాలన్న ఆసక్తితోనే ఇబ్రహీంతో కలిసి ముఠాలో చేరాను. అయితే తాను చేసిందేమీ లేదని’ ఎన్‌ఐఏ అధికారుల విచారణలో బండ్లగూడలో అరెస్టయిన నరుూమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్ వెల్లడించాడు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నామని ఇబ్రహీం చెప్పాడని, అప్పటికే ఆసక్తి ఉండడంతో అతనితో కలసి పనిచేసేందుకు అంగీకరించానని ఎన్‌ఐఏ ఎదుట చెప్పాడు. తాము తరచూ సమావేశమయ్యేవారమని, ఓరోజు హఠాత్తుగా మాడ్యుల్ చీఫ్ (అమీర్)గా ప్రకటించాడని వివరించాడు.