రాష్ట్రీయం

26వరకు ఐసిస్ నిందితుడి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఐసిస్ కుట్ర కేసులో రెండో దఫా కస్డడీకి తీసుకున్న నిందితుడు అతావుల్లా రహ్మాన్ పోలీస్ కస్టడీ ముగిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అతణ్ని శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరచారు. దీంతో కోర్టు అతనికి ఈనెల 26 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశానుసారం రహ్మాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ సహా దేశంలోని పలు పట్టణాల్లో విధ్వంసం సృష్టించే కుట్రలో ఐసిస్ అనుమానితుడిగా అతడిని ఈనెల 12న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా రహ్మాన్‌ను అప్రూవర్‌గా చేసేందుకు యోచిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. బోధనల ద్వారా యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ దిశగా లోతుగా దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. తెలంగాణలో కొంతమంది యువకులను రిక్రూట్ చేసినట్టు, ఫైరింగ్, పేలుళ్లకు సంబంధించి శిక్షణ ఇచ్చినట్టు రహ్మాన్ ఎన్‌ఐఏ ఎదుట ఒప్పుకున్నట్టు సమాచారం.