తెలంగాణ

సాహితీ కల్పవృక్షం సుప్రసన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట (వరంగల్), జూలై 24: తెలంగాణ సాహిత్యంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు తలమానికం లాంటివాడని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన వరంగల్‌లో అశోక కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం సన్నుతి పుస్తకావిష్కరణ సభ, ఆచార్య కోవెల సుప్రన్నాచార్య అశీతి పూర్తి అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సుప్రసన్నకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక పాత్ర ఉందని, ఆయన రచనలు భావి తరాలకు మార్గనిర్దేశనం చేస్తాయని అన్నారు. తెలుగుసాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో సుప్రసన్న వినూత్నమైన ప్రయోగాలు చేశారని కొనియాడారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక నిత్యసత్యమని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య వరంగల్ నగరానికే కీర్తితెచ్చిన వారని కొనియాడారు. ఆయన సాహితీ కృషీవలుడని అన్నారు.
కవిగా, విమర్శకునిగా తాత్వికునిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులని తెలిపారు. భారతీయ విలువలకు కట్టుబడి రచనలు చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచించిన గ్రంథాలు భావితరాల వారికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఆచార్య ఎస్.వి.రామారావు మాట్లాడుతూ సుప్రసన్న రాసిన ప్రతి కావ్యం తెలంగాణ సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటివని తెలిపారు. ఆచార్య శ్రీరంగాచార్యులు మాట్లాడుతూ సుప్రసన్న ఒక సాహితీ కల్పవృక్షమని, ఆయన అక్షరాలను మననం చేసుకోవడం అందరికీ అయ్యేపని కాదని వివరించారు. ఆచార్య లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కోవెల వారు నిత్యసత్యవాది అని, ఆయన సాహిత్యం కంటే వ్యక్తిత్వం గొప్పదని తెలిపారు. అరవిందుడు, శివానందమూర్తి లాంటి వారి భావాలను పుణికి పుచ్చుకొని ఆధ్యాత్మిక రంగంలోనూ విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అశీతి మహోత్సవ అభినందన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించగా సంచిక సంపాదకుడు డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంచిక విశేషాలను వివరించారు. సమితి కార్యదర్శి గిరిజా మనోహరబాబు నివేదికను సభికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ ఎం.వి.రంగారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కె.బి.రాఘవన్, మిద్దెల రంగనాధ్, నాగిళ్ల రామశాస్ర్తి, నెల్లుట్ల రమాదేవి, విఆర్ విద్యార్థి ఆచార్య సనత్‌కుమార్, త్రిపురనేని గోపీచంద్, డాక్టర్ బన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో ఆదివారం కోవెల సుప్రసన్నాచార్యులును సన్మానిస్తున్న తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు