రాష్ట్రీయం

యువతి గొంతు కోసిన ఉన్మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 25: తన ప్రేమను నిరాకరించిన యువతిపై పట్టపగలు పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు ఓ యువకుడు. గాజులరేగ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన కలకలం రేకెత్తించింది. గాజులరేగ మెయిన్ రోడ్డులో బాధిత కుటుంబం కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. దాడిలో గాయపడిన యువతి డిగ్రీ చదువుతోంది. ఏడాది కిందట వరసకు బంధువు అయ్యే విక్రమ్ అనే యువకుడు బాధితురాలిని చూసి ప్రేమ అంటూ వెంట బడ్డాడు. తరుచూ కాలేజీకి వెళ్లి వేధించేవాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పగా కాలేజీ మాన్పించేశారు. దీంతో ఎస్‌కోటకు చెందిన ఆ యువకుడు తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని ఇటీవల సంబంధం కలుపుకోవడానికి యువతి ఇంటికి వచ్చాడు. అయితే తమకు ఇష్టం లేదని యువతి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అప్పటికి ఊరుకున్న యువకుడు సోమవారం అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం విక్రమ్ కత్తితో గాజులరేగ వచ్చి యువతిపై దాడికి దిగాడు. కుటుంబసభ్యులు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా వెంటనే బంధువులు, తల్లిదండ్రులు ఆమెను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి