రాష్ట్రీయం

అతిథిగృహంలో చిరుత పులి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 25:తిరుమల కాలిబాటలో కనుమ మార్గంలో కనిపిస్తూ భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన చిరుత పులి సోమవారంనాడు ఏకంగా ఓ అతిథిగృహంలోకే చొరబడింది. విఐపిలు బసచేసే పద్మావతి అతిథి భవనంలోని నర్శింగ్ సదన్ అతిథి గృహంలోకి సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో చొరబడిన పులి, మూడున్నర గంటలపాటు అటు భక్తుల్ని, ఇటు అధికారులను పరుగులు పెట్టించింది. అతిథి గృహం మెట్లు ఎక్కేందుకు పులి ప్రయత్నిస్తూ, పట్టు తప్పి జారిపోతుండగా గమనించిన ముగ్గురు సిబ్బంది ప్రాణభయంతో ఒక్క ఉదుటున అతిథి భవనం మిద్దెపైకి చేరుకొని తలుపులు బిడాయించుకున్నారు. పైనుంచి కేకలు వేస్తూ ఇటు భక్తుల్ని, అటు అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని ఓఎస్‌డి లక్ష్మీనారాయణ యాదవ్, జెఇఓ శ్రీనివాసులరాజుసహా అటవీశాఖ అధికారులు కూడా నర్శింగ్ సదన్‌కు చేరుకున్నారు. అటవీ అధికారులు పులికోసం అతిథి గృహంలో గాలిస్తున్నారు. అటవీ శాఖ ఫారెస్టు రేంజర్ బాలాజీ సాహసం చేసి కత్తిలాంటి ఆయుధాన్ని చేతబట్టుకుని అతిథి భవనంలోకి ప్రవేశించి గాలించారు. అయితే పులి జాడ తెలియలేదు. అదే అతిథి గృహంలో ఉన్న భక్తులను స్వయంగా జెఇఓ శ్రీనివాసరాజు అప్రమత్తం చేశారు. లోపలే గడియ పెట్టుకుని ఉండాలని, బయటకు రావద్దని హెచ్చరించారు. కాగా రాత్రి పదిన్నర గంటల వేళ అతిథి గృహంలోకి అటవీ అధికారులు ప్రవేశించి, అంగుళం అంగుళం గాలించారు. పులి జాడ మాత్రం కనిపించలేదు. చివరకు అతిథి భవనంలో అటవీమార్గం వైపు ఉన్న ఒక కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో పులి ఆ కిటికీ గుండా వెళ్లిపోయి ఉంటుందని నిర్థారించారు. దీంతో అప్పటివరకూ గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన అదే అతిథి గృహంలోని భక్తులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం.. మేడపైనుంచి సిబ్బందిని నిచ్చెన సాయంతో కిందకు దించుతున్న టిటిడి అటవీ అధికారులు