రాష్ట్రీయం

వివాదాలకు దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదంలో జోక్యం చేసుకోబోనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానికి తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వివరించానని, మోదీతో భేటీ సాధారణమేనన్నారు. అయితే హైకోర్టు విభజన అంశంపై చర్చించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి విషయం తెలియదని, పత్రికలలో మాత్రమే చూశానన్నారు. న్యాయశాఖ మంత్రి కొత్తగా బాధ్యతలు తీసుకొన్న సందర్భంగా మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశానన్నారు. న్యాయ మంత్రితో హైకోర్టు అంశం చర్చించలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, పంటలు బాగా పండుతాయని, మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కర పనులు సకాలంలో పూర్తవుతాయన్నారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన జల వివాదంతోపాటు, ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోబోనని ఒక ప్రశ్నకు బదులు చెప్పారు. సాయంత్రం రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు.

చిత్రం.. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఉమ్మడి గవర్నర్ నరసింహన్