రాష్ట్రీయం

ఇక వెలగపూడిలోనే ఉభయ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జూలై 25: శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలను వెలగపూడిలోనే నిర్వహిస్తామని శాసనమండలి చైర్మన్ చక్రపాణి తెలిపారు. మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత 2వ బ్లాకు, అసెంబ్లీ కోసం ఏర్పాటు చేస్తున్న 6వ బ్లాకును పరిశీలించిన అనంతరం నిర్మాణం పూర్తయిన 5వ భవనాన్ని తిలకించారు. అనంతరం చక్రపాణి విలేఖర్లతో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి అన్ని శాఖల అధికారులు తరలివస్తారని తెలిపారు. పనులను వేగవంతంగా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చక్రపాణి కితాబిచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరు నాటికి అన్ని భవనాల నిర్మాణ పనులూ పూర్తవుతాయన్నారు. సచివాలయ ప్రాంగణంలోని రహదారులు, మురుగునీటి కాల్వలు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా రెండు రహదారులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు వల్ల ముంపు ప్రమాదం ఉందని, దాని నివారణ కోసం తగిన ఏర్పాట్లకు నైపుణ్యం కలిగిన నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.

చిత్రం.. తాత్కాలిక సచివాలయ భవనాల వివరాలు చిత్రపటం ద్వారా మండలి చైర్మన్ చక్రపాణికి వివరిస్తున్న ఏపి మంత్రి నారాయణ