రాష్ట్రీయం

హైకోర్టు తక్షణం విభజించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: ఉమ్మడి హైకోర్టు విభజనకు డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం నాడు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో భారీ ధర్నా చేపట్టారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల్ని ఏర్పాటు చేయాలని, ఈ విభజనను నిర్దిష్ట గడువుతో కేంద్రం ప్రకటించాలని, న్యాయాధికారుల నియామకాలను రద్దు చేయాలని టి న్యాయవాదులు డిమాండ్ చేశారు. వందలాది న్యాయవాదులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి టిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఆప్, బిజెపి నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రశాంతంగా నిరసన చేపట్టిన న్యాయాధికారులను సస్పెండ్ చేయడం సమంజసం కాదని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. బిజెపి ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతున్న సమయంలో న్యాయవాదులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉండి తీరాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రెండు నెలల్లోనే ఆ రాష్ట్రాలలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశారని టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఇటీవల కెసిఆర్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన హామీపై విశ్వాసం ఉన్నందున ఈ సమావేశాల్లో తాము నిరసన తెలపకుండా ఉన్నామన్నారు. ఆప్ నేత సోమ్‌నాథ్‌భారతి కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పది జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు.

చిత్రం.. సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ న్యాయవాదులకు మద్దతుగా నినాదాలు చేస్తున్న ఎంపి కవిత