రాష్ట్రీయం

విపక్షాలకు ఆయుధంగా ‘మల్లన్న’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: మల్లన్నసాగర్ భగభగమంటోంది. రెండేళ్లపాటు నిర్నిరోధంగా సాగుతూవచ్చిన కెసిఆర్ పాలనకు మల్లన్నసాగర్ పెద్ద గుదిబండగా మారింది. కెసిఆర్‌పై దాడికోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ‘మల్లన్న’ బ్రహ్మాస్త్రంగా దొరికింది. అన్ని పక్షాలు.. అసంతృప్తితో ఉన్న ప్రజాసంఘాలు, సంస్థలు, నాయకులు ఒక్కుమ్మడిగా మల్లన్నసాగర్‌ను భుజానికెత్తుకుని యుద్ధం ప్రారంభించారు. ఆందోళనలు, పోరాటాలు, బంద్‌లు, నిరసనలు, నిరాహారదీక్షలు, దిష్టిబొమ్మ దహనాలతో మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టనున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ అట్టుడుకుతోంది. స్థానిక రైతులు జాతీయ రహదారులను దిగ్బంధం చేసేస్తున్నారు.
సోమవారం అఖిలపక్ష బంద్ జరిగితే, మంగళవారం ‘్ఛలో మల్లన్నసాగర్’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇక బిజెపి మండలాల వారీగా ధర్నా కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను కలుపుకుని అన్ని పార్టీలూ పోరాటాలకు దిగుతున్నాయి. ఇదివరకే పలు దఫాలుగా పలువురు కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నేతలు మల్లన్న సాగర్ నిర్వాసితులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
మంగళవారం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఉపాధ్యక్షుడు మల్లురవి అధ్యక్షతన గాంధీభవన్ నుంచి సుమారు 200వాహనాలతో ఛలో మల్లన్నసాగర్ చేపట్టనున్నారు. వివిధ జిల్లాల నుంచి రైతులను కూడా హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు.
టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి పక్షం రోజుల కింద మల్లన్న సాగర్ ప్రతిపాదిత రిజర్వాయర్ వద్ద 48 గంటల పాటు దీక్ష చేశారు. మరోవైపు బిజెపి రాష్ట్ర నాయకులు ప్రభుత్వ మొండి వైఖరిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. సోమవారం రైతులను కలిసేందుకు వెళ్ళిన తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం మండలాల వారీగా ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రైతులు సానుకూలంగా ఉన్నా ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చెప్పిందే నిజమైతే రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన మామ, ముఖ్యమంత్రి కెసిఆర్ మెప్పు పొందడానికే ఈ రిజర్వాయర్ నిర్మించాలన్న ఆలోచన చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైతే మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి, మన పోలీసులు, మన రైతులే ఉంటారని నాడు ఉద్యమ సమయంలో కెసిఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణను భట్టివిక్రమార్క తోసి పుచ్చారు.
ఖండిస్తున్న మంత్రులు
ఇలాఉండగా విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే ఆందోళనలు చేపట్టాయని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. భూసేకరణ కోసం రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే తాము రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకున్నామని వారు చెప్పారు.