రాష్ట్రీయం

ఎవరికీ పట్టని అంత్యపుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26 : గోదావరి ఆదిపుష్కరాలకు ప్రభుత్వపరంగా భారీ హంగామా జరగగా, అంత్యపుష్కరాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 2016 జూలై 31 (ఆషాడ బహుళ త్రయోదశి) నుండి ఆగస్టు 11 (శ్రావణ మాసం శుద్దఅష్టమి) వరకు గోదావరి అంత్యపుష్కరాలు నిర్వహించాల్సి ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఎపి ప్రభుత్వం ఈ కార్యక్రమం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. గత ఏడాది జూలై 14 నుండి 25 వరకు జరిగిన గోదావరి ఆదిపుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏపిలో కొన్ని దుస్సంఘటనలు మినహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు విడుదల చేసి, ఆదిపుష్కరాలు నిర్వహించాయి.
అంత్యపుష్కరాలు జూలై 12 నుండి పనె్నండు రోజులు నిర్వహిస్తున్నారు. గోదావరి అంత్యపుష్కరాలకు ప్రభుత్వం పరంగా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానిక అధికారులే ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఆదిపుష్కరాలకు ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్‌లను, దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లను ఉపయోగించునే ఏర్పాట్లు స్థానిక అధికారులే చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాల ప్రారంభం సందర్భంగా జూలై 31 న ఏర్పాటుచేస్తున్న కార్యక్రమంలో విశ్వయోగి విశ్వంజీ పాల్గొంటున్నారు.
తెలంగాణలో బాసర, మంథని, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో గోదావరి అంత్యపుష్కరాల నిర్వహణకు కొంత హడావుడి కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో గోదావరి అంత్యపుష్కరాలు నిర్వహిస్తున్నారు. అంత్యపుష్కరాల సమయానికి గోదావరి నదిపొడవునా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు, ప్రధాన కేంద్రాల్లో నదిలో నీరు ప్రవహిస్తోంది. గోదావరి అంత్యపుష్కరాలకు పెద్దగా ప్రాధాన్యత లేదని ప్రముఖ పండితుడు శ్రీరంగాచార్యులు తెలిపారు.