తెలంగాణ

మోండా మార్కెట్‌లో కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: సికిందరాబాద్ ఆర్‌పి రోడ్‌లోని మోండా మార్కెట్‌లో మంగళవారం ఓ పురాతనం భవనం కుప్పకూలి ఓ షాపు యజమాని దుర్మరణం చెందాడు. శిథిలాల క్రింది చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని గాంధీకి తరలిస్తూండగా మృతి చెందాడు. భవనం కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే జిహెచ్‌ఎంసి, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన షాపు యజమానిని గోపాల్‌గా గుర్తించారు.
ఆలయాల్లో
విలువలు బోధించాలి
ఆలయాల రక్షణ ఉద్యమ కన్వీనర్ సౌందరరాజన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26 : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్తులకు నైతిక విలువల గురించి బోధించాలని ఆలయాల పరిరక్షణ ఉద్యమం (టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్) కన్వీనర్ ఎంవి సౌందరరాజన్ కోరారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, స్వామి దయానంద సరస్వతి దాఖలు చేసిన ఒక పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. నైతిక విలువలను ఒక సబ్జెక్టుగా చేరిస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దేవాలయాల్లో భక్తులకు ధర్మాన్ని గురించి, నైతిక విలువల గురించి బోధించడంలో ఎలాంటి తప్పులేదన్నారని సౌందరరాజన్ వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భారతీయ సంప్రదాయాలు, నీతి, న్యాయం, ధర్మం గురించి బోధించాలని, నైతిక విలువలకు అందరూ కట్టుబడి ఉండాలని బోధించడంలో శ్రద్ద వహించాలని కోరారు.
ఎన్‌ఆర్‌ఐ పాలసీపై
నేడు సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనకు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు మంగళవారం అధికారులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించే పాలసీ దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీపై బుధవారం కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. సమావేశంలో వచ్చే అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా ప్రభుత్వం పాలసీ రూపొందిస్తుంది.
రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర
కాంగ్రెస్ నేత విహెచ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: రిజర్వేషన్లు తొలగించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రంపై వత్తిడి తెస్తున్నదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి.హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. బిసిలకు ప్రధాని నరేంద్రమోదీ న్యాయం చేయడం లేదని విహెచ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. క్రిమిలేయర్ పేరిట బిసిల నోట్లో మట్టి కొట్టాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. యుపిఎస్‌సిలోనూ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిసిల రిజర్వేషన్ల కోసం తాను తమిళనాడు, బిహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్య నేతలను కలిసి ఉద్యమించనున్నట్లు ఆయన చెప్పారు.

ఆన్‌లైన్ బీమా మోసగాడు అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: బీమా పాలసీలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో పాలసీదారులను మభ్యపెట్టి లక్షలాది రూపాయలు దండుకునేందుకు అలవాటు పడిన ఢిల్లీకి చెందిన సంజీవ్ కుమార్ అనే ఘరానా మోసగాడిని హైదరాబాద్ సిటీ సిసిఎస్ విభాగానికి చెందిన సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన హరి సతీష్ అనే వ్యక్తి తనను ఢిల్లీకి చెందిన కొంత మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో మోసం చేశారని, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని చెప్పి 1.47 లక్షల రూపాయలను తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన సంజీవ్‌కుమార్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో బీమా పాలసీపై రుణం అడిగిన సంజీవ్ కుమార్ ఫోన్లు చేసి సొమ్మును డిపాజిట్ చేస్తే వెంటనే రుణం మంజూరవుతుందని ఆశపెట్టాడు. ఈకేసులో మరో ఏడుగురు వ్యక్తులు వేరువేరు ఫోన్లతో బాధితుడికి ఫోన్ చేసి నమ్మించారు. సొమ్ము డిపాజిట్ చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హరి సతీష్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఢిల్లీ కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ కుమార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆన్‌లైన్ ద్వారా బీమా పాలసీలపై రుణం ఇస్తామంటూ వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్‌ను పట్టించుకోరాదని పోలీసులు హెచ్చరించారు.

కిడ్నాప్ కేసులో

8మందికి జీవిత ఖైదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: కిడ్నాప్, దోపిడీ, డబ్బుల కోసం బెదిరించిన కేసులో తొమ్మిది మందికి జీవిత ఖైదును విధిస్తూ ఎల్‌బినగర్ 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్‌కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. 2009లో పాతబస్తీలో అనిల్ కుమార్, సుధీర్ కుమార్‌ను రైస్ పుల్లింగ్ బౌల్ ఉందని, దీని వల్ల సులువుగా డబ్బు సంపాదించవచ్చని, అలాగే తమ వద్ద ప్రాచీన కళాఖండాలు ఉన్నాయంటూ కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు, చిత్తూరు, సికింద్రాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులతో ఏర్పడిన ముఠా ఆశపెట్టింది. వీరి మాటలను నమ్మి వెళ్లిన అనిల్‌కుమార్, సుధీర్‌కుమార్‌ను నిందితులు కిడ్నాప్ చేసి పది లక్షల రూపాయల సొమ్ము ఇవ్వాలని వీరి బంధువుసునీల్ కుమార్ శ్రీవాత్సవ్‌కు ఫోన్ చేసి తెలిపారు. సునీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధితులను కిడ్నాప్ చెర నుంచి తప్పించారు. అనంతరం ఈ కేసులో మొఘల్‌పురా పోలీసు ఇనెస్పెక్టర్ డి రాజ్‌కుమార్ నిందితులను పట్టుకున్నారు.
ఈ కేసును చురుకుగా దర్యాపుచేసి చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు ముందుంచారు. ఈ కేసులో కె శ్రీ్ధర్, ఎం సత్యజిత్ రాజేష్, జి శ్రీనివాసరెడ్డి, ఎం రాజేంద్రప్రసాద్, సిహెచ్ తనూజ్ కుమార్, పోతరాజు సింగవరపు, కె రామలింగ ప్రసాద్, ఎం శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టు 2012లో నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారించిన ఎల్‌బి నగర్ రెండవ అదనపు సెషన్స్ జడ్జి నిందితులకు జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.