రాష్ట్రీయం

ఆశలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఇద్దరు చంద్రుల ఆశలు ఆవిరయ్యాయి. నియోజకవర్గ పునర్విభజనపై గంపెడాశలు పెట్టుకున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరావు భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని కేంద్రం దెబ్బతీసింది. 2026 వరకూ నియోజకవర్గ పునర్విభజన ఉండదని రెణ్ణెళ్ల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన విషయానే్న మరోసారి కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేయటంతో రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తూ వచ్చిన అధికార పార్టీలు ఇక వాటికి బ్రేక్ వేయక తప్పేట్లు లేదు. తమ పార్టీలో చేరితే, వచ్చే ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచే పోటీ చేయవచ్చని, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నందున మీ రాజకీయ భవిష్యత్తునకు వచ్చిన ఇబ్బందేమీలేదని నచ్చచెప్పి, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టిడిపి, టిఆర్‌ఎస్‌లు పెద్ద ఎత్తున చేర్చుకున్నాయి. ఏపిలో తెదేపా ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఇప్పటిదాకా 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా తెదేపా, కాంగ్రెస్, సీపీఐకి చెందిన 21మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తెలంగాణలో ప్రస్తుతానికి ఆకర్ష పథకానికి విరామం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మరోసారి తమ పార్టీల్లో చేరికలను ప్రోత్సహించాలనుకున్న చంద్రబాబు, చంద్రశేఖర్‌రావుప్రయత్నాలకు అటార్నీ జనరల్ అభిప్రాయం మేరకు రాజ్యాంగ సవరణ లేకుండా నియోజక వర్గాల పునర్విభజన సాధ్యం కాదని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేయటంతోఅడ్డుకట్ట పడినట్లయింది. ఏపిలో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 వరకూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని ఇద్దరు ముఖ్యమంత్రులు, చాలాకాలం నుంచీ కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. వివిధ అంశాలపై విభేదిస్తున్న ఇద్దరూ ఈ విషయంలో మాత్రం, రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటే ధోరణి ప్రదర్శిస్తుండటం విశేషం. ఆ మేరకు రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానం కూడా చేసి, కేంద్రానికి పంపారు. తమ లక్ష్యసాధనకు ఇద్దరూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా లాబీయింగ్ చేశారు.
వెంకయ్య కూడా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించి, ఉన్నతాధికారులతో నియోజకవర్గాల సంఖ్యపై ఉన్న మార్గాలను అనే్వషించారు. పార్లమెంటులో బిల్లు పెడతామని, అయితే అది ఎప్పుడన్నది చెప్పలేమని వెంకయ్య మీడియాకు వెల్లడించారు. అయితే తాజా పరిణామాలతో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప నియోజకవర్గాల సంఖ్య పెరగటం సాధ్యం కాదని స్పష్టమైంది.
తెలంగాణలో మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో, ఏపిలో ఇంకొందరు వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చించుకోవాలని ప్రయత్నిస్తున్న రెండు పార్టీల నాయకత్వాలకు తాజా పరిణామాలు నిరాశ కలిగించాయి. ఇక తామేమి హామీ ఇచ్చి కొత్త ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాలన్న అంశం రెండు పార్టీల నాయకత్వాల ముందు ప్రశ్నార్థకంగా నిలిచింది.