రాష్ట్రీయం

కాలంతో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: కృష్ణా పుష్కరాలకు కేవలం 15 రోజులు వ్యవధి మాత్రమే ఉండటంతో పుష్కర పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పుష్కర విధులు నిర్వహించేందుకు పోలీసు బలగాలు, ఉన్నతాధికారులు విజయవాడకు చేరుకుంటున్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే పుష్కర ఘాట్లలో జరుగుతున్న పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.యాత్రికులకు ఏ చిన్న సమస్యా ఎదురుకాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, విజయవాడ ఎంపీ కేసినేని నాని తదితరులు గురువారం సాయంత్రం పుష్కర ఘాట్లను, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన ఆకర్షణగా ఉండే ప్రకాశం బ్యారేజీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉండవల్లి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్డు విస్తరిస్తున్నారు. ఉండవల్లి నుంచి సీతానగరం ఘాట్‌కు వెళ్లే మార్గాన్ని ఇప్పటికే విస్తరించారు. ఈ ఘాట్‌కు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
1143 కోట్ల రూపాయలతో కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 1687 పనులు ప్రారంభించామని ప్రత్యేకాధికారి రాజశేఖర్ చెప్పారు. యాత్రికులు స్నానాలు చేసేందుకు మూడు జిల్లాల్లో 156 ఘాట్లు నిర్మించామన్నారు. రోజుకు లక్ష మందికి పైగా యాత్రికులు వచ్చే ఘాట్లు విజయవాడ నగరంలో ఐదు, కృష్ణా జిల్లాలో రెండు ఉన్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో 80 ఘాట్లు ఉన్నాయన్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో ఉన్న ఘాట్ల వివరాలనూ ఆయన వెల్లడించారు.
మూడు జిల్లాల్లో ఘాట్లకు సమీపంలోనే పూజా సామగ్రి కిట్లు సిద్ధం చేశామని ప్రత్యేకాధికారి రాజశేఖర్ చెప్పారు.
నిరంతర నిఘా
పుష్కరాలకు లక్షల్లో యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే పుష్కర ఘాట్లు పరిశీలించి, భద్రతకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. పుష్కర యాత్రికులు ఒక్కసారిగా నగరానికి చేరుకుంటే, క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా చెయ్యాలన్న అంశంపైనా అధికారులతో చర్చిస్తున్నారు. దుర్గా ఘాట్, భవానీ ఘాట్, కృష్ణవేణి, పద్మావతి ఘాట్, ఇబ్రహీంపట్నంలోని ఉన్న పవిత్ర సంగమ ఘాట్‌ను ఎ ప్లస్ ఘాట్లుగా గుర్తించి అవసరానుగుణంగా పోలీసులను నియోగిస్తున్నారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద ఉన్న మోడల్ గెస్ట్ హౌస్‌ను సెంట్రల్ కంట్రోల్ రూమ్‌గా రూపొందించారు. ప్రధాన కూడళ్లు, పుష్కర ఘాట్ల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కరాల 12 రోజులు, 24 గంటలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఇద్దరు ఐపిఎస్ అధికారుల నేతృత్వంలో ఈ కంట్రోల్ రూం పనిచేస్తుంది. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు, సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం వెళ్లిపోతుంది. ముందు జాగ్రత్త చర్యగా 140 బాంబ్ స్కాడ్లనూ రంగంలోకి దింపుతున్నారు.