తెలంగాణ

ఎమ్సెట్-3 తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఎమ్సెట్-2 లీకేజిపై అధికారులు, న్యాయ నిపుణులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాలుగు గంటల పాటు తర్జన భర్జనలు జరిపిన అనంతరం ఎట్టకేలకు రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎమ్సెట్-2 రద్దుపై అధికారికంగా సోమవారం ప్రకటన చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఎమ్సెట్-2 లీకేజి సూత్రదారులు అందరినీ రెండు మూడు రోజులలో మీడియా ముందు ప్రవేశపెట్టడంతో పాటు ఎమ్సెట్-3 షెడ్యూల్‌ను సోమవారం నాటికి సిద్ధం చేసి ప్రకటించాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. అలాగే ఎమ్సెట్-3కు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎమ్సెట్-2 కు విద్యార్థులు ఫీజు చెల్లించడంతో ఎమ్సెట్-3 కి తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని కూడా ప్రకటన చేయాలని సిఎం ఆదేశించినట్టు తెలిసింది. ఎమ్సెట్-2 లీకేజిపై తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లీకేజిపై డిజిపి అనురాగ శర్మ అందజేసిన నివేదికపై న్యాయ నిపుణులు, వైద్య, విద్యాశాఖ ఉన్నతాధికారులతో
ముఖ్యమంత్రి చర్చించి ఈ మేరకు రద్దు చేయాలని నిర్ణయించారు. గతంలో వివిధ ప్రశ్నపత్రాలు లీకేజి అయిన సందర్భంగా పలు యూనివర్సిటీలు వ్యవహరించిన తీరు, ఈ అంశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు వెలువరించిన తీర్పులపై ముఖ్యమంత్రి సూదీర్ఘంగా చర్చించారు. సిఐడి నివేదిక ఆధారంగా లీకుల ద్వారా ర్యాంకులు పొందిన విద్యార్థులను అనర్హులుగా ప్రకటించి మిగతా వారికి అడ్మిషన్లు చేపడితే ఎలా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి న్యాయ నిపుణులను, అధికారుల అభిప్రాయాలను కోరారు. ఎమ్సెట్-2 రద్దు చేయకుండా అడ్మినిషన్లు జరిపితే న్యాయ పరమైన చిక్కులు తప్పవని, అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆ తర్వాత సమస్యగా మారుతుందని అది ప్రభుత్వానికి మరింత సమస్యగా మారుతుందని అధికారులు వివరించారు. ఎమ్సెట్ రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఎవరైనా ఆశ్రయిస్తే, న్యాయ స్థానం అభ్యంతరం తెలిపితే ఇబ్బందులు తప్పవని అధికారులు వివరించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 సార్లు వివిధ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించినట్టు అధికారులు వివరించారు. అలాంటి సందర్భాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ముఖ్యమంత్రి పరిశీలించిన అనంతరం ఎమ్సెట్ రద్దు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్టు తెలిసింది. వరుస ఎంట్రెన్స్‌లతో విద్యార్థులు అలిసిపోయి, విసిగిపోయారని, వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేసిందని ముఖ్యమంత్రితో సహా సమావేశంలో పాల్గొన్న అధికారులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలనలో అలవాటు పడిన జాడ్యం అనవాయితీగా మారడం వల్లనే తాజాగా ఎమ్సెట్ లీకేజి అయిందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్టు తెలిసింది. అయితే ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. లీకేజి సూత్రదారులకు కఠిన చట్టాలను వర్తింపచేయాలని, లీకేజిలకు పాల్పడిన వారినే కాకుండా ప్రోత్సహించిన వారినీ, వాటిని వినియోగించుకున్న వారినీ కఠినంగా శిక్షించాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు.
విద్యార్థులకు వెసులుబాటు ఇప్పటికే మెడికల్ ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులకు ఊరట ఇచ్చే విధంగా తిరిగి ఎంట్రెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత రిజిస్ట్రేషన్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పరీక్ష జరిగే రోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
సూత్రదారులకు కఠిన శిక్షలు పడేలా కేసులు
వేలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేసిన ఎమ్సెట్-2 లీకేజి కారకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. భవిష్యత్‌లో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తప పిల్లలను అక్రమ మార్గంలో ప్రోత్సహించిన తల్లిదండ్రులను కూడా శిక్షించాల్సిందేనని అధికారులు సూచించారు. లీకేజి సూత్రదారులు అందరినీ ఒకటి రెండు రోజుల్లో పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.