తెలంగాణ

మల్లన్నసాగర్‌కు... లేదా జైలుకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, జూలై 29: మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించకుండా అరెస్టు చేసిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. పంపితే మల్లన్నసాగర్‌కు పంపండి లేదంటే జైలుకు పంపండి అని భీష్మించుకొని కూర్చున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టివిక్రమార్క, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సునీతారెడ్డితో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఐడిఏ బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో తిష్ట వేశారు. అక్కడే రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీస్‌స్టేషన్ ముందే ధర్నాకు దిగారు. రాత్రి 9గం. వరకు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి కూరగాయాలు సైతం తరిమారు. వంట అనంతరం అందరూ అక్కడే భోజనాలు చేశారు. పోలీసులు విడుదల చేసినా తమను పంపితే మల్లన్నసాగర్ బాధితుల పరామర్శకు పంపండి లేదంటే కేసు చేసి జైలుకు పంపండి అని తెగేసి చెప్పారు. జిల్లా నాయకులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. చివరకు రాత్రి 9.30కి కోర్టు సునీతారెడ్డి, దామోదరరాజనర్సింహలతో పాటు మరో ఎనిమిది మందికి మల్లన్నసాగర్ వెళ్ళడానికి అనుమతిని ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.