తెలంగాణ

కాంగ్రెస్ నేతలను అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిథిలోని మూడు గ్రామాలను సందర్శించేందుకు ఇద్దరు కాంగ్రెస్ నేతలను అనుమతించాలని హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం మెదక్ జిల్లా ఎస్‌పిని ఆదేశించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని వారు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ రామచంద్ర రావు పరిశీలించి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు.
రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్ళే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తమ వెంట నలుగురు అనుచరులకు మించి తీసుకెళ్ళరాదని, ఊరేగింపుగా వెళ్ళరాదని, బహిరంగ సభ నిర్వహించరాదని షరతు విధించారు. అలాగే మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు వెళ్లే కాంగ్రెస్ నాయకులకు పోలీసు రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాకుండా పిటీషనర్లు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించరాదని, సందర్శన అనంతరం వారు హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని తెలిపారు. పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదన విన్న జస్టిస్ రామచంద్రరావు, పోలీసుల నిబంధనల గురించి ప్రశ్నించారు. ప్రాజెక్టును అడ్డుకుంటే జైలులో పెడతామంటూ ఎస్పీ, మంత్రి చేసిన వ్యాఖ్యలకు న్యాయమూర్తి జస్టిస్ విస్తూపోతూ ‘మనం కాశ్మీర్‌లో ఉన్నామా?’ అని ప్రశ్నించారు.
భూసేకరణకు సంబంధించి 2013 సంవత్సరంలో చేసిన చట్టాన్ని పక్కనపెట్టి రైతులకు ప్రభుత్వం తక్కువ పరిహారాన్ని చెల్లిస్తోందని పిటీషనర్లు పేర్కొన్నారు. గురువారం (28న) మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు నిలువరించారని వారు తెలిపారు. అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కొన్ని గ్రామాల్లో రాళ్ళ దాడి జరగడం, ఉద్రిక్తలకు దారి తీయడంతో అనేక మంది గాయపడ్డారని, దీంతో అక్కడ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిందని చెప్పారు. ప్రతిపక్షాల ఊరేగింపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని శాంతి-్భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.