రాష్ట్రీయం

వింత వానలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని మహానగరంలో విచిత్ర వాతావరణం నెలకొంది. తెల్లవారుఝాము చిరుజల్లులు, చల్లటి గాలులతో ప్రారంభమవుతున్న వాతావరణం మధ్యాహ్నం ఓ మోస్తరు ఎండకొట్టి, తర్వాత ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమవుతుంది. చిరుజల్లులతో మొదలై జడివాన దంచికొడుతోంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదార్లు జలమయమయ్యాయి. నాగమయ్యకుంట, నదీంకాలనీ, రాంనగర్ రామాలయం వీధి, బాలాజీనగర్, పార్శిగుట్ట గాంధీనగర్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. శనివారం కూడా సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో దాదాపు గంటపాటు ఆర్టీసి క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తరుచూ వర్షాలు కురుస్తుండటంతో జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు అప్రమత్తమయ్యాయి. కానీ ఆయా సర్కిళ్ల అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేస్తే మాత్రం స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. నగరంలోని లక్డీకాపూల్, అమీర్‌పేట, పంజాగుట్ట, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, పార్శిగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారం రాత్రి ఎరగ్రడ్డ టిబి ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ అక్కడకు చేరుకుని తెల్లవారుఝము 5 గంటల వరకు నీటిని తోడించే పనులను పర్యవేక్షించారు. నీరు నిలబడిపోయే ప్రాంతాల్లో అత్యవసర బృందాలు అందుబాటులో ఉండాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే, ముఖ్యప్రాంతాల్లో మెట్రో పనులు జరుగుతుండటంతో, ఇప్పటికే రోడ్లు దెబ్బతిని ఉన్నాయ. దీంతో కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్‌ల సమస్య ఉత్పన్నమవుతోంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అనేకచోట్ల ట్రాఫిక్ జామ్‌ల సమస్య ఉత్పన్నమైన జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చిత్రం.. శనివారం సాయంత్రం ఇదీ సిటీ ట్రాఫిక్ పరిస్థితి