రాష్ట్రీయం

నేటినుంచి గోదావరి అంత్య పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30 : గోదావరి అంత్యపుష్కరాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 11 వరకు ఇవి జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే విషయమై అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఉన్న స్నాన ఘట్టాలనే ఎలాంటి మరమ్మతులు లేకుండా ఉపయోగిస్తున్నాయి. పుష్కరాల నిర్వహణకు తెలంగాణ దేవాదాయ కమిషనర్ శివశంకర్, ఎపి దేవాదాయ కమినర్ నేతృత్వంలో ఇప్పటికే సంబంధిత జిల్లాల దేవాదాయ అధికారులతో సమావేశం నిర్వహించినా, వౌలిక సదుపాయాల విషయంలో పెద్దగా దృష్టి పెట్టిన వారు లేరు. తెలంగాణలోని బాసరలో దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అంత్యపుష్కరాలను ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ధర్మపురిలో విశ్వయోగి విశ్వంజీ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. భద్రాచలంలో జరిగే అంత్యపుష్కరాల ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటున్నారు. కోటిలింగాల, మంథని, కాళ్వేరంలలో కూడా గోదావరి అంత్యపుష్కరాలను ప్రారంభిస్తున్నారు. ఇలా ఉండగా ఎపిలోని రాజమండ్రి, నర్సాపురం తదితర ప్రాంతాల్లో గోదావరి అంత్యపుష్కరాలను ప్రారంభిస్తున్నారు.

చిత్రం.. భద్రాచలంలో అరకొర పుష్కర ఏర్పాట్లు