రాష్ట్రీయం

సింగరేణి ఉద్యోగులకు 3న సకల జనుల సమ్మె వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించి, వేతనాలు కోల్పోయిన సింగరేణి ఉద్యోగులకు ఆగస్టు 3న సమ్మెకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి ఉద్యోగులకు సకల జనుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు 67వేల మంది ఉద్యోగులకు సుమారు రూ. 130 కోట్లు చెల్లించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొని ప్రస్తుతం రోల్స్‌లో ఉన్న 51వేల మంది ఉద్యోగులు ఆగస్టు 3వ తేదీన వేతనాలు తీసుకోనున్నారు. అదేవిధంగా సకల జనుల సమ్మెలో పాల్గొని పదవీ విరమణ చేసిన 16వేల మంది ఉద్యోగులకు కూడా త్వరలో వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది. సకల జనుల సమ్మెకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో అమల్లో ఉన్న నియమ, నిబంధనల ప్రకారం ఈ చెల్లింపులు చేస్తున్నారు. అలాగే సమ్మె కాలంలో జీతపు లీవులు, సిక్ లీవులు వినియోగించుకున్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం అట్టి లీవులను వారి వారి లీవుల ఖాతాల్లో జమ చేస్తారని సంస్థ వివరించింది.