రాష్ట్రీయం

ముక్త్యాలలో టూరిజం ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: రాజధాని అమరావతికి సమీపంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందడుగు పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలోని ముక్త్యాల వద్ద 310 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్‌షిప్.. అమరావతికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. దీనికి సంబంధించి 218 కోట్ల వ్యయంతో 48.57 ఎకరాల్లో నదికి అభిముఖంగా నెలకొల్పుతున్న మెగా టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై గురువారం ఉదయం ఏపి పర్యాటక శాఖతో జిఅండ్‌సి గ్లోబల్ కన్సార్టియం అవగాహన ఒప్పందం చేసుకుంది. కృష్ణ, పాలేరు నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటవుతున్న ఈ టౌన్‌షిప్‌లో తెలుగు వైభవం పేరిట ఆంధ్ర సంస్కృతికి అద్దంపట్టే హస్తకళా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. తెలుగు సంప్రదాయ వంటకాలతో కూడిన ఫుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. అక్కడికి దగ్గరలో ఉన్న ట్యాంక్‌బండ్‌పై తెలుగు వైభవమూర్తుల విగ్రహాలను నెలకొల్పి దాన్ని ప్రసిద్ధ విహారస్థలిగా రూపొందిస్తారు. యువజనుల కోసం ఫిష్ డెక్స్, అడ్వంచర్ స్పోర్ట్స్, గోల్ఫ్ కోర్స్, సిల్క్ డవలప్‌మెంట్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్, అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్, సీనియర్ సిటిజన్స్ కోసం ఆశ్రమం, బొటానికల్ గార్డెన్, స్టార్ హోటల్, పెద్ద కనె్వన్షన్ సెంటర్, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పది వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని జి అండ్ సి గ్లోబల్ కన్సార్టియం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏవిఆర్ చౌదరి తెలియచేశారు.