తెలంగాణ

ప్రైవేట్ ఫార్మసీ ఫీజు రూ.40వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఫార్మా కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) రంజీవ్ ఆర్ ఆచార్య పేరుతో ఈ ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. ‘బి.్ఫర్మసీ’ (ప్రైవేట్ అన్-ఎయిడెడ్) కాలేజీల్లో ఫీజులు 35 వేల నుండి 40 వేల రూపాయలుగా ఉండేలా నిర్ణయించారు. అలాగే ‘్ఫర్మ-డి’ కాలేజీల్లో (ప్రైవేట్ అన్ ఎయిడెడ్) ఫీజులు 68 వేలనుండి 1,10,000 రూపాయల వరకు ఉండేలా అనుమతించారు.
కాలేజీల వారీగా ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
‘బి.్ఫర్మసీ (ప్రైవేట్ అన్‌ఎయిడెడ్)
చైతన్యి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, వరంగల్, జనగాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, జనగామ, శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వరంగల్, సహస్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, మహమ్మదీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఖమ్మం, నేతాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, వరంగల్ కాలేజీల్లో ఫీజు 35 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఖమ్మం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఖమ్మంలో ఫీజు 40 వేల రూపాయలుగా, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, జనగామలో 45 వేల రూపాయలుగా నిర్ణయించారు.
ఫార్మ.డి (ప్రైవేట్ అన్‌ఎయిడెడ్)
బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అమ్మపాలెం, కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సంపేట, కెఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజ్, సహస్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్, వాగ్దేవీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వాగ్దేవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్ కాలేజీల్లో 68 వేల రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. ఖమ్మంలోని మాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్‌లో 75 వేలు, వరంగల్‌లోని చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్‌లో 80 వేల రూపాయలు, హన్మకొండలోని సెంట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్‌లో 1,10,000 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.