ఆంధ్రప్రదేశ్‌

పోటెత్తిన నాగావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 7: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా నాలుగురోజులుగా ఒడిశాలో కుంభవృష్టికి నాగావళి నదికి వరద పోటెత్తింది. ఈ వరద శ్రీకాకుళం జిల్లాలో కునుకుపేట సమీపంలో గల పొన్నాడలంక ప్రాంతాన్ని చుట్టుముట్టింది. శనివారం ఉదయం లంకలో గల జీడితోటలకు ఎరువులు వేసే పనిలో నిమగ్నమైవున్న విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం, రావుపాలేంకు చెందిన 28 మంది కూలీలు చిక్కుకున్నారు. పొన్నాడలంకకు ఇరువైపులా నాగావళినీరు ప్రవహించడంతో ఆ తోటల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా 24 గంటలు తిండితిప్పలు లేకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇందులో ఆదివారం ఉదయం తొమ్మిది మంది మాత్రం ఈతరావడంతో లంక నుంచి నాగావళి తీరానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత కుటుంబాలకు సమాచారం అందించగా, వారంతా అప్రమత్తమై జిల్లా యంత్రాంగానికి విషయాన్ని తెలిపారు. ఇంతలో లంకలో చిక్కుకున్న మరికొంతమంది తమ వద్ద గల సెల్‌ఫోన్‌ల ద్వారా 108, 100 నెంబర్లకు కాల్ చేయడంతో ఆర్‌ఐడిఎఫ్(రిస్కీ టీమ్స్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి నేతృత్వంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎయిర్‌బోట్ల సహాయంతో ఆర్‌ఐడిఎఫ్ బృందం లంకకు చేరుకుని 19 మందిని నాగావళి తీరానికి ఒడ్డుకు చేర్చారు. వైద్యపరీక్షలు నిర్వహించి, ఆహారం పెట్టారు. ఈ సంఘటన తెలుసుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కునుకుపేట నాగావళి తీరానికి చేరుకుని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఏడాది మూడు, నాలుగు రోజులు పొన్నాడలంకలో జీడితోటలకు ఎరువులు, పురుగుల మందులు వేసుకుంటూ అక్కడ వుండి ఆహారపదార్థాలు, పొయ్యిలు, వంటచెరకులతో పనులు చేసుకోవడం పరిపాటి. పొన్నాడలంకలో సమారు ఏభై ఎకరాల జీడితోటల పనులు విశాఖపట్నం రైతులు కౌలుకు తీసుకున్నవారితోపాటు, కూలీలు వస్తుంటారు. వీరంతా నాగావళి వరదకు చిక్కుకుపోవడంతో ఈసారి వారి వ్యవసాయపనులకు ఆటంకం ఏర్పడింది.

పొన్నాడలంక నుంచి ఆర్‌ఐడిఎఫ్ బృందాల సహాయంతో తీరానికి చేరుకున్న కూలీలు