ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఆగస్టు 7: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. శ్రీవారి వాహనాల్లోనూ, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పంచమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా ‘గరుడ పంచమి’ పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండేందుకు, స్ర్తిలు తమకు పుట్టిన సంతానం గరుడునిలా బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహన సేవలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో గరుడ పంచమి సందర్భంగా
గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు