ఆంధ్రప్రదేశ్‌

రూ.6,400 కోట్లతో 320 గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (ఖానాపురం హవేలి), ఆగస్టు 8: రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల వ్యయంతో 320 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.. సోమవారం ఖమ్మం నగరంలో జిల్లా ప్రవాస భారతీయులు (జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫోరం) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వమూ చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే 320 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని, వీటిద్వారా 1.75 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా 10వేల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి మరీ అనేక మంది తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విశ్వాసం కల్పించాలని కడియం కోరారు. డిఎస్సీ ఆలస్యమవుతున్న దృష్ట్యా రాష్ట్రంలో జూలైలో 9వేల మంది విద్యావలంటీర్లను నియమించామన్నారు. అదేవిధంగా 5వేల ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడించారు. మండల కేంద్రమైన కూసుమంచి జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు.