ఆంధ్రప్రదేశ్‌

దత్తత ఫలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 9: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను అరకు ఏజెన్సీలో గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, తన ప్రయత్నం మంచి ఫలితానే్న ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాను దత్తత తీసుకున్న అరకు మండలం పెదలబుడు గ్రామంలో సిఎం మంగళవారం పర్యటించి, గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. తాను చేసిన ఈ ప్రయత్నం మరికొంతమందికి స్పూర్తిదాయకం కావాలని భావించి, గిరిజన ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నానన్నారు. విశాఖ ఏజెన్సీని విద్య, వైద్య, పర్యాటక రంగాల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా అరకు కాఫీని ప్రధాని మోదీకి రుచి చూపించామని, అద్భుతమైన కాఫీ సేవించిన ప్రధాని ఎంతగానో మెచ్చుకున్నారని చంద్రబాబు చెప్పారు. సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేస్తున్న అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే అరకు ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అరకులో అపెరల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

చిత్రం... గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తున్న సిఎం చంద్రబాబు