ఆంధ్రప్రదేశ్‌

‘పని’ పట్టాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9:పుష్కర పనులు చురుగ్గా సాగడం లేదా? ఇంకా 48 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయా? అధికార గణాంకాలు సైతం అది నిజమేనంటున్నాయి. మరో రెండు రోజుల్లో పుష్కరాలు మొదలు కాబోతుండగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన పనుల్లో 48 శాతం పూర్తి కాలేదని సాక్షాత్తూ సిఎం డ్యాష్ బోర్డు చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ పాలన సాగిస్తున్న చంద్రబాబు నిరంతరం పరిశీలించే డ్యాష్ బోర్డులో స్పష్టమైన సమాచారమే ఉండాలి. పుష్కరాల కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కేవలం 93 పనులు మాత్రమే ఇప్పటివరకూ పూర్తి చేసింది. ఆర్‌అండ్‌బి శాఖ 15 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. జలవనరుల శాఖ 110 పుష్కర పనులు మొదలుపెడితే, 62 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 48 శాతం పనులు పూర్తి కావల్సి ఉంది. ట్రాన్స్‌కో 103 పనులను చేపట్టగా 33 పనులు మాత్రమే పూర్తయ్యాయని, 70 పనులు, అంటే 67 శాతం పనులు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని సిఎం డ్యాష్ బోర్డు వివరాలనుబట్టి తెలుస్తోంది. మరో 48 గంటల్లో పుష్కర పవిత్ర స్నానాలు మొదలవనున్నాయి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర సంగం వద్ద పుష్కరాలు ప్రారంభమైన తరువాత కూడా పనులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర పనులు ఆలస్యంగా ఆరంభం కావడంతోపాటు, నిధులు విడుదల్లో జాప్యం ఇందుకు కారణమని తెలుస్తోంది. అలాగే, పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కూడా నత్తనడకన పనులు సాగిస్తున్నారు. నగరంలో అర్థరాత్రివేళ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. అందులో లోపాలు కనిపించకుండా స్టోన్ డస్ట్ చల్లుతున్నారు. వేసిన కొద్ది రోజుల్లోనే ఆ రోడ్లపై గోతులు వెలుగు చూస్తున్నాయి. పుష్కర ఘాట్‌లపై వేసిన టైల్స్ 12 రోజులు పూర్తి కాకుండానే పోయే పరిస్థితి కనిపిస్తోంది.