ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రవేశపెట్టిన ప్రైవేట్‌బిల్లును మనీబిల్లు పేరుతో పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సిఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను వంచించి ప్రజాద్రోహులుగా మారారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. క్విట్ ఇండియా ర్యాలీలో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలోని కాంగ్రెస్‌భవన్ నుంచి తాడిపత్రి బస్టాండ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కూడలిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులు భారతదేశం వదలి వెళ్ళాలని నాడు గాంధీ మహాత్ముడి సారధ్యంలో క్విట్‌ఇండియా ఉద్యమం నిర్వహించారన్నారు. ప్రత్యేకహోదాకై విద్యార్థులు, యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హోదాకన్నా ప్యాకేజీ వస్తేనే ప్రయోజనకరమన్న చంద్రబాబు ప్రకటన సత్యదూరమన్నారు. హోదా వల్ల పరిశ్రమల స్థాపనకు రాయితీలు వస్తాయన్నారు. ప్యాకేజీల వల్ల ప్రభుత్వాధినేతలకే లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సిపిఎం మినహా తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, వైసిపి లేఖలు ఇచ్చాయన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాకై ప్రైవేట్‌బిల్లును కెవిపి రామచంద్రరావుప్రవేశపెడితే మనీ బిల్లు పేరుతో బిజెపి ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందన్నారు. ప్రైవేట్ బిల్లు మనీబిల్లు కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల బిల్లు అని అన్నారు. ఈ విషయాన్ని బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలన్నారు.