రాష్ట్రీయం

కురుక్షేత్ర, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: దేశంలో ప్రతి భక్తుడికి శ్రీ వేంకటేశ్వర స్వామిని చేరువ చేయాలనే లక్ష్యంతో టిటిడి పనిచేస్తోందని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చదలవాడ బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్యానాలోని కురుక్షేత్ర, తమిళనాడులోని కన్యాకుమారి పట్టణాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని అన్నారు. కన్యాకుమారి ఆలయంలో నేరుగా సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు. ఆధ్యాత్మిక చింతనకు అతి పెద్ద కేంద్రంగా తిరుపతి మారిందని, సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలను భక్తులకు అందించేందుకు అనునిత్యం ఎన్నో చర్యలను చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్‌లో టిటిడి దేవస్థానం ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరిగిందని త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. మూడు గంటలకే తిరుమలలో దర్శనం ప్రారంభించినట్టే హైదరాబాద్‌లో కూడా సేవలు మొదలవుతాయని అన్నారు. అనేక నగరాల్లో అభిషేకం నిర్వహించామని, కొన్ని పట్టణాల్లో శ్రీ వారి సేవా కార్యక్రమాలకు లక్షల్లో భక్తులు వచ్చారని గుర్తు చేశారు. దేవాలయాలను, పురోహితులను కాపాడేందుకు కూడా అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పారు. జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నెంబర్ 92లో మూడున్నర ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని టిటిడి బోర్డు సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు, సినీనటుడు రాజశేఖర్, అధికార ప్రతినిధి పి కరుణ, శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు.