ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల పేరుతో స్కూళ్ల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: పుష్కరాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ నెల 28వ తేదీ వరకూ పాఠశాలలకు సెవలు ప్రకటించడంతో పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్టు మారింది. సెలవులకు సంబంధించి ఇటు కృష్ణా కలెక్టర్, అటు గుంటూరు కలెక్టర్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించినా, పదో తరగతి విద్యార్థులకు మాత్రం దాదాపు 20 రోజులు సెలవులు ఇవ్వడం వల్ల చదువులు చెట్టేక్కే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నా అధికారులు వచ్చి బలవంతగా వాటిని మూసివేయించడమేగాక, స్కూళ్లు తెరిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించడంపై కూడా యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. పాఠాలు చెబుతామంటే స్కూళ్లు మూయిస్తామనడం ఏం పద్ధతి అని వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన అన్ని తరగతులకు సెలవులు ఇచ్చినా టెన్త్ విద్యార్థులకు ఇవ్వడం సరైంది కాదని వారు చెబుతున్నారు. స్కూళ్లు తెరిస్తే వాటిని సీజ్ చేస్తామని విజయవాడ ఉప విద్యాశాఖాధికారి కొండా రవికుమార్ ఒక ప్రకటన చేస్తూ స్కూళ్లు తెరిస్తే 8143436343 నెంబర్‌కు సమాచారం ఇవ్వమనడం దారుణమని అంటున్నారు.
మరోపక్క పేరుకు సెలవులు ఇచ్చినా, అదే సమయంలో పోటీలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులు రాష్టవ్య్రాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో కాంపిటిషన్లు నిర్వహించాలనే విద్యా శాఖ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు చెప్పారు. 11న వరలక్ష్మీ వ్రతం, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్రదినోత్సవం, 18న శ్రావణ పూర్ణిమ ప్రభుత్వ సెలవులు ఉన్నాయని, ఆ సమయంలో పోటీలు పేరుతో మళ్లీ స్కూళ్లు పనిచేయాలని చెప్పడం విడ్డూరమని వారు పేర్కొన్నారు.