ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ‘అమృత’ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యూనివర్శిటీని నెలకొల్పేందుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ముందుకొచ్చింది. బుధవారం విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ట్రస్ట్ ప్రతినిధులు కలుసుకున్నారు. విద్యా ప్రమాణాల్లో దేశంలోని ప్రైవేట్ యూనివర్శిటీల్లో తాము ముందున్నామని, అమరావతిలో అతిపెద్ద క్యాంపస్ నెలకొల్పేందుకు తాము ఆసక్తిగా వున్నట్టు ముఖ్యమంత్రికి మాతా అమృతానందమయి ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు. అమరావతిలో యూనివర్శిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా కోరగా ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అమృతానందమయి గొప్ప మానవతావాది అని, ట్రస్ట్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో నెలకొల్పే యూనివర్శిటీలో హాస్పిటల్‌తో పాటు మెడికల్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు చోటు కల్పించనున్నారు. మొత్తం రెండు దశలలో నెలకొల్పే యూనివర్సిటీలో మొదటి దశలో 18వేల మంది విద్యార్థులు, రెండో దశ పూర్తయితే మరో 25 వేల మంది విద్యార్థులు మొత్తం 43 వేల మంది చదువునే అవకాశం లభించనుంది.

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాతా అమృతానందమయి ట్రస్ట్ ప్రతినిధులు