ఆంధ్రప్రదేశ్‌

దోషులను కఠినంగా శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ విజయవాడ, ఆగస్టు 10: కోనసీమలోని ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి పంచాయతీ పరిధిలోని సుధాపాలెంలో దళితులపై జరిగిన దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. నేర సంఘటనల్లో దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినా, దళితులపై దాడులు చేసినా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఎంతటివారైనా వదలబోమని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు.
దీంతో కలెక్టర్ అరుణ్‌కుమార్ బుధవారం హుటాహుటిన అమలాపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణం లక్ష రూపాయల చొప్పున సహాయాన్ని అందించాల్సిందిగా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దాడికి దారితీసిన కారణాలపై జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే దాడికి కారకులైన వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ ప్రభుత్వానికి నివేదించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మోకాటి ఎలీషా, వెంకటేశ్వరరావును రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పరామర్శించేందుకు అమలాపురం ఏరియా ఆసుపత్రికి వెళ్తున్నారు.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, పౌర హక్కుల సంఘం నేతలతో పాటు దళిత, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు దాడి ఘటనను ఖండించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తన పర్యటనను రద్దుచేసుకుని, గురువారం బాధితులను పరామర్శించేందుకు వస్తున్నట్టు తెలియజేశారు. ఉదయం 9.30 గంటలకు బాధితులను పరామర్శించి, 11 గంటలకు అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో దాడి ఘటనపై విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మతం ముసుగులో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ఎంతమాత్రం దేశానికి మంచిది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి సంఘటనల పట్ల పాలకులు, పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తిచేశారు. దళితులపై జరిగిన దాడి అమానుషమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. గుజరాత్ ఘటన జరిగి వారం రోజులు పూర్తికాకుండానే అమలాపురం ఘటన జరగడం బాధాకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, బాధ్యులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కన్నబాబు కోరారు.
గోరక్షణ పేరిట దాడులు సరికాదు: కమలానంద భారతి
భీమవరం: గోరక్షణ పేరుతో దళితులపై దాడులు సమర్థనీయం కాదని పరమహంస పరివ్రాజకాచార్య కమలానంద భారతి స్వామీజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చర్మకారులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ సామాజికవర్గాన్ని కులవృత్తి చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశువులను ఎవరైనా అక్రమ రవాణాచేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పులులు, సింహాలు, జింకలకు ఉన్న మాదిరిగానే గోవులకు కూడా అభయారణ్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంకాయ, బీరకాయ మాదిరిగా కొందరు గోవులను కూడా తినేస్తున్నారని మండిపడ్డారు. నేతలంతా రాష్ట్ర విభజన తరువాత పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారని శ్రీ కమలానంద ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరూ ఇక్కడకు వచ్చి భాగస్వాములు కావాలన్నారు. జగన్ తన ఇల్లు అమ్ముకుని ఇక్కడకు వచ్చేయాలని డిమాండ్ చేశారు.