ఆంధ్రప్రదేశ్‌

ఐటి సాయంతో యాత్రికుల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: కృష్ణా పుష్కారాలను వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పక్కా జాగ్రత్తలు తీసుకుంటోంది. పుష్కరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒకేచోట పెద్దఎత్తున భక్తులు చేరకుండా చూడాలని, అలా చేయడం ద్వారా నియంత్రించాలని అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద పుష్కరాల కోసం వస్తున్న భక్తులను అంచనా వేసి ఎవరిని ఏఏ ఘాట్ల వైపునకు మళ్లించాలనే దానిపై అధికారులు ముందుగానే ఓ అంచనాకు వస్తారు. ఐటీతో పాటు ఇటీవల అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ల ద్వారా పార్కింగ్ సౌకర్యాలు, భక్తుల రద్దీని, వచ్చివెళ్లేవారి లెక్కలను సులువుగా తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిస్టమ్‌ను రూపొందించారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్దకు వస్తున్న యాత్రికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వారిని విడతల వారీగా ఆయా ఘాట్లకు తరలించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. భక్తులు విజయవాడ నగరంలోని ఘాట్ల వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుంటారని భావిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని 170 ఘాట్లలో రాష్ట్రంలోనేకాక ఇతర రాష్ట్రాల నుంచి మూడున్నర కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.
పుష్కరాలకు యాత్రికులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనేది అంచనా వేయటం, యాత్రికులను ఏఏ ఘాట్ల వద్దకు తరలించాలనే దానిపై అధికారులు ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తారు. ఒకే ఘాట్ వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. పుష్కరాలకు వస్తున్న భక్తులను నగర పరిసరాల్లో ఏర్పాటు చేసిన 1400 సిసిటివి కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడం, యాత్రికులను ఎక్కడికక్కడ నియంత్రించాలని యంత్రాంగం భావిస్తోంది. పుష్కర యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి భక్తుల మన్నన పొందాలని కూడా అధికారులు ఆశిస్తున్నారు.