ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే హోదా రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 10: ‘కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే ప్రత్యేక హోదా రాదు. మైత్రి కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ సాధిస్తాం. అలాగని ప్రత్యేక హోదాను మేం వ్యతిరేకిస్తున్నట్లు కాదు’.. అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి యువతను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. హోదా సందర్భంగా చర్చ జరుగుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు టీ తాగేందుకు వెళ్లడం ఏపాటి చిత్తశుద్ధికి నిదర్శనమో తేల్చాలన్నారు. తమ పార్టీ కేంద్రంతో పొత్తు వదులుకుంటే మధ్యలో దూరేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రత్యేక హోదా వచ్చినంతనే ఉపాధి అవకాశాలు రావన్నారు. హోదా వచ్చి ఇంట్లో నిద్రపోతే ఉద్యోగం వస్తుందా? అని జగన్‌ను ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 30సార్లు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని, ఇప్పటివరకు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం లేరన్నారు.
పుష్కర పనుల్లో నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు
దేశంలో ఏ రాష్టమ్రూ చేయనివిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తోందని బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన నారా లోకేష్ చెప్పారు. కృష్ణమ్మ పేరుతో కృష్ణా పుష్కరాలకు సంబంధించిన యాప్‌ను ఈసందర్భంగా ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కృష్ణా ఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పొందుపర్చారు. ఇప్పటివరకు కృష్ణా పుష్కర పనులు 95 శాతం పూర్తవగా ఇంకా కేవలం 5 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో కృష్ణా పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. తెలుగుయువత, విద్యార్థి సంఘాలు కలసికట్టుగా కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు.