ఆంధ్రప్రదేశ్‌

స్నానఘట్టాల వద్దే రైల్వే టిక్కెట్ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: క్రిస్ అప్రూవ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో స్నానఘట్టాల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్ల జారీకి 40 యూనిట్లతో విజన్ టెక్ సంస్థ ముందుకొచ్చింది. స్థానిక కలెక్టరు ఛాంబరులో బుధవారం రైల్వే శాఖ అనుమతితో రూపొందించిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరం ద్వారా స్వచ్ఛందంగా యాత్రికులకు టిక్కెట్ల జారీపై వివరాలను కంపెనీ ప్రతినిధి రమేష్, టెక్నికల్ సహాయకులు హేమంత్ వివరించారు. పుష్కర యాత్రికులు స్నానాలు ఆచరించిన అనంతరం రైల్వేస్టేషన్లలోని క్యూలైన్లలో అధిక సమయం వేచివుండకుండా ఘాట్ల వద్దనే సాధారణ టిక్కెట్లు విక్రయిస్తామన్నారు. ఈ విధానం ద్వారా యాత్రికులు అనుకున్న సమయంలో తిరుగు ప్రయాణం చేయగలుగుతారన్నారు. అయితే ఈవిషయంలో సంబంధిత టిక్కెట్లు జారీ చేసే బృందం వివిధ రూట్లలో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలను అందించాల్సి వుంటుందని వారు చెప్పారు. రైల్వే శాఖ అధికారికంగా జారీ చేసే రైల్వే టిక్కెట్ మీదే ప్రయాణ ప్రాంతం వివరాలను ముద్రించి అందిస్తామని విజన్ టెక్ ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ముందస్తుగా రైల్వేకు నగదును డిపాజిట్ చేయడం ద్వారా ఆ మొత్తానికి టిక్కెట్ల జారీకి అనుమతి వస్తుందని ఆయన వివరించారు.