ఆంధ్రప్రదేశ్‌

థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌కు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఆగస్టు 10: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడో యూనిట్‌కు సంబంధించి భూమిపూజ బుధవారం జరిగింది. ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవేంద్రరావు, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖరరావు ఇంజనీర్ల బృందంతో కలిసి మూడో యూనిట్‌కు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విద్యుత్ అవసరం రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందన్నారు. రెండు యూనిట్లు పూర్తిచేసుకుని మూడో యూనిట్‌కు భూమిపూజ చేయడం హర్షణీయమన్నారు. 5500 కోట్ల రూపాయల వ్యయంతో మూడో యూనిట్ నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. టాటా, బిహెచ్‌ఇల్ కంపెనీలకు ఈ నిర్మాణ పనులు అప్పగించినట్లు ఆయన తెలిపారు. 90 నుండి 95 శాతం వరకు పరికరాలు ఇండియాలోనే లభిస్తుండడంతో మూడో యూనిట్ ఖర్చు తగ్గిందన్నారు. ఈ ప్రాజెక్టులో స్థానిక, స్థానికేతరులకు సుమారు 800 మందికి ఉపాధి లభించనున్నట్లు ఆయన తెలిపారు.