ఆంధ్రప్రదేశ్‌

నేడు డబుల్ డెక్కర్ రైలు కూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 11: ప్రయాణికుల సుదీర్ఘ కల నెరవేరింది. డబుల్‌డెక్కర్ రైలు శుక్రవారం నుంచి పట్టాలెక్కుతుంది. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించుకున్న డబుల్ డెక్కర్‌ను కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన దక్షిణమధ్య రైల్వే పలుప్రాంతాల మధ్య దీనిని నడుపుతుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఇది తిరుగుతుంది.
*విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (07761/07762) డబుల్ డెక్కర్ రైలు విశాఖపట్నంలో ఈ నెల 13న మధ్యాహ్నం 12.05 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇది ఈ నెల 17, 21 తేదీల్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఇదే రైలు తిరుపతి-విశాఖపట్నం (07762) మధ్య ఈ నెల 14, 18 తేదీల్లో నడవనుంది. ఈ రోజుల్లో తెల్లవారుజామున 4.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజున సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇందులో పది కోచ్‌లతోపాటు మరో రెండు మోటార్ కార్ కోచ్‌లు ఉంటాయి.
*విశాఖపట్నం-విజయవాడ (07763) డబుల్ డెక్కర్ రైలు విశాఖపట్నం నుంచి ఈ నెల 15, 19 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరుతుంది. ఇది విజయవాడకు అదేరోజు సాయంత్రం 5.50గంటలకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖపట్నం (07764) విజయవాడలో ఈ నెల 16, 20 తేదీల్లో ఉదయం 10.25 గంటలకు బయలదేరి విశాఖపట్నంకు అదేరోజు సాయంత్రం 4.45 గంటలకు చేరుకుంటుంది.
* సికింద్రాబాద్-విశాఖపట్నం (07759) రైలు సికింద్రాబాద్‌లో ఈ నెల 12న (శుక్రవారం) రాత్రి 9.20 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి మరుసటి రోజున ఉదయం 10.15 గంటలకు చేరుకుంటుంది. ఇది మల్కాజ్‌గిరి, వరంగల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ మీదుగా నడుస్తుంది. డబుల్ డెక్కర్‌లో విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రయాణ చార్జీలు రూ.605, విశాఖపట్నం-తిరుపతి మధ్య రూ.1050, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రూ.765లుగా నిర్ణయించామని డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖముఖర్జీ గురువారం విలేఖరులకు తెలియజేశారు. ఈ నెల 12 నుంచి 23 వరకు ఇవి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. రాయగడ-కృష్ణా కెనాల్ జంక్షన్ (08505/06) మధ్య నాలుగు రైళ్ళు ఈ నెల 11, 16, 19, 22 తేదీల్లో నడుస్తాయన్నారు. ఇందలో థర్డ్ ఏసి-1, స్లీపర్-5, జనరల్ సెకండ్ క్లాస్-10, సెకండ్ క్లాస్ సిటింఘ్ కమ్ లగేజీ కంపార్టుమెంట్‌లు 2 సదుపాయం కల్పించామన్నారు.