రాష్ట్రీయం

దేశమంతటా విశిష్ట విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో రానున్న రోజుల్లో ప్రజలందరికీ విశిష్ట విద్యను అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి వచ్చిన జవదేకర్ శనివారం నాడు పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్రం త్వరలో జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోందని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణకు సెప్టెంబర్ 15దాకా గడువు ఇచ్చిందన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులుచేర్పులు చేస్తామని ఆయన వివరించారు. జవాబుదారీతనం, పరిశోధనలకు ప్రోత్సాహం, వినూత్నత, ప్రామాణికత, అందరికీ చేరువ చేయడంతో పాటు గుణాత్మక మార్పునకు కూడా కృషి చేయనుందని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం పేరిట రాజ్యాంగంలో మార్పులు తీసుకువస్తారేమోననే భయాలు అక్కర్లేదని, ఆ విధమైన చర్యలకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. నూతన జాతీయ విద్యావిధానం ఆర్‌ఎస్‌ఎస్ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేశారు. అందరికీ గుణాత్మకమైన ప్రామాణిక విద్యను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ఎంత వెచ్చిస్తున్నామో, దాదాపు అంతకు సమానమైన నిధులను ప్రభుత్వం విద్యారంగంపై ఖర్చు చేస్తోందన్నారు. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కని, దాన్ని వంద శాతం అమలు చేసేలా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా, ఆసక్తి కలిగించేలా, వినోదాన్ని పంచేలా పాఠ్యాంశాలను బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని అన్నారు. విద్యార్థుల్లో పరిశోధనా రంగంవైపు ఆలోచనలు మళ్లేలా విద్యాబోధన ఉండాలని, విద్యార్థులు ప్రతి అంశంపై తరచి తరచి ప్రశ్నలు అడుగుతూ తమ జిజ్ఞాసను పెంచుకోవాలని తద్వారా నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. పరిశోధనలతోనే దేశం ప్రగతిని సాధిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కేంద్రం ఏర్పాటు చేయదలచిన అన్ని జాతీయ విద్యాసంస్థలకు త్వరలో అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని జవదేకర్ పేర్కొన్నారు.
అంతకు ముందు ఆయన ముషీరాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ప్రకాష్ జవదేకర్ సిఎం కె చంద్రశేఖరరావును కలిశారు. సాయంత్రం వివిధ యాజమాన్యాల ప్రతినిధులతోనూ, ఉన్నతాధికారులతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. భారతదేశ స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 9వ తేదీ నుండి 23వ తేదీవరకూ ‘ఆజాదీ 70-యాద్ కరో కుర్బాని’ అనే పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర పక్షోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నాడు ప్రకాష్ జవదేకర్ విజయవాడ చేరుకుని అక్కడ పుష్కర స్నానం ఆచరిస్తారు, అక్కడి నుండి ఆయన ఢిల్లీ వెళ్తారు.

చిత్రం... హైదరాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రకాష్ జవదేకర్