ఆంధ్రప్రదేశ్‌

ముసాయిదా ముందే ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో, కొత్త జిల్లాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ముందుగా ముసాయిదా ప్రకటించాలని, ఆ తరువాతనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరిస్తే బాగుంటుందని విపక్షాలకు చెందిన శాసన సభ్యులు సూచించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. శనివారం రెండవ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ జిల్లాల విభజన ఏ విధంగా ఉండాలో కమిటీకి సూచించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్న సబ్ కమిటీని మొదటి రోజు ఉద్యోగ సంఘాలు కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించగా, శనివారం రోజున రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ నాయకులు కలిసి అభిప్రాయాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉన్నాయని, ఈ 150 డివిజన్లను ఒకే జిల్లాలో ఉంచాలని బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరారు. ఒకే జిల్లాలో ఉంచుతున్నారా? లేదా వెల్లడించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాపై కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని సబ్ కమిటీ దృష్టికి కొందరు తీసుకు వచ్చారు. జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ప్రకటించాలని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే పారదర్శకంగా నిర్ణయాలు ఉంటాయని సబ్ కమిటీలోని మంత్రులు ఎమ్మెల్యేలకు తెలిపారు. పరిపాలనా సొలభ్యం కోసమే జిల్లాల విభజన అని తెలిపారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలో జిల్లాల విభజన పూర్తయిందని, బెంగాల్‌తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే జిల్లాల విభజన జరగలేదని మంత్రులు తెలిపారు. విభజనపై వస్తున్న రకరకాల ప్రచారాలు ఎలా ఉన్నా శాస్ర్తియంగానే విభజన జరుగుతుందని మంత్రులు చెప్పారు. ఆదివారం ఇదే విధంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సబ్ కమిటీ తెలుసుకుంటుంది. రంగారెడ్డికి చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి కూడా జిల్లాల ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మతాల్లో సంస్కరణలు అవసరం
సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి
హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 13: మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి మతంలో సంస్కరణలు అవసరమని సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి అన్నారు. శనివారం సోమాజిగూడలోని ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాత్రికేయుడు తుఫేల్ అహ్మద్ రచించిన ‘జిహాదిస్ట్ త్రెట్ టు ఇండియా’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రవాద ఆలోచనలను తగ్గించేందుకు రచయిత చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ పుస్తకం కేవలం ముస్లింలకే కాక మేధావులు, సామాజికవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంజె అక్బర్, తుఫేల్ అహ్మద్ భారతదేశంలో ఉన్న గొప్ప జర్నలిస్టులని అన్నారు. న్యూ ఏజ్ ఇస్లాం డాట్ కామ్ ఎడిటర్ సుల్తాన్ షహీన్ మాట్లాడుతూ ముస్లిం వేరు ఇస్లాం వేరని, ఆత్మాహుతిని ఇస్లాం సమర్థించదని అన్నారు. చరిత్రను గమనిస్తే ఇస్లాంలో హింసను కోరుకున్న వారు, శాంతికాముకులు ఉన్నారని, ప్రతిసారి శాంతిని కోరుకున్న వారే పైచేయి సాధించినట్టు తెలిపారు. రచయిత తుఫేల్ అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాం మతంలో సంస్కరణల అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలానుగుణంగా మతంలోని లోపాలను సరిచేసుకునేందుకు ముందుకు వచ్చినప్పుడే శాంతియుత సమాజాన్ని నిర్మించకోగలుగుతామన్నారు. ప్రొడ్యూసర్ మస్తాన్ వలీ మాట్లాడుతూ ఇస్లాం మతంలో సంస్కరణలు కోరుతున్న వారు బయటకు వచ్చి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు సైతం భయపడాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరమని అన్నారు. అభూత కల్పనలను దూరం చేసేందుకు మత పెద్దలు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.