తెలంగాణ

మ్యాన్‌హోల్ మృతుల కుటుంబ సభ్యుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: హైటెక్ సిటీలోని అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్‌హోల్ వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. శనివారం అనేక వ్యర్థాలతో నిండిన మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు వెదజల్లడంతో ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే తమ కుటుంబ పోషకులు మరణించడంతో తమ పరిస్థితి అయోమయంగా ఉందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని మాణికేశ్వర్ నగర్‌కు చెందిన వారు కోరారు. మృతుల కుటుంబీకులు చేపట్టిన ఆందోళనకు పలువురు విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. మ్యాన్‌హోల్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజి నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ప్రపం చ కార్మిక దినోత్సవం రోజు ఇద్దరు కార్మికులు మ్యాన్‌హోల్ నుంచి వ్యర్థాలను తీసే క్రమంలో ఊపిరాడక మృతి చెందిన సంఘటన మరువకముందే తాజాగా శనివారం చోటుచేసుకున్న సంఘటన స్థానికులను కలచివేసింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఇదే ప్రాంతంలో జరిగాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఇక్కడి డంపింగ్‌కు వస్తాయి. దీంతో కార్మికులు శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని శుభ్రం చేయాల్సి ఉండగా ఎలాంటి వసతులు, సౌకర్యాలు, వస్తువులు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మరోసారి జిహెచ్‌ఎంసి నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించగా వాటర్ వర్క్స్ ఈడి సత్యనారాయణ నేతృత్వంలో ద ర్యాప్తు కొనసాగుతోంది. పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ నిర్లక్ష్యం సంఘటనకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.