రాష్ట్రీయం

రేపే కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఖరారు చేసిన రోడ్ మ్యాప్‌లో జాప్యం జరిగినప్పటికీ మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుతో ప్రక్రియ ఉపందుకుంది. జిల్లాలవారీగా ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను కేవలం మూడు రోజుల వ్యవధిలో పూర్తిచేయడంతో కీలక అంకం పూరె్తైంది. ఈనెల 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ప్రక్రియ ఒక్కటి ముగిస్తే, దాదాపు80 శాతం ప్రక్రియ పూరె్తైనట్టేనని ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత 20న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం నివేదిక సమర్పించడం, 24న (పుష్కరాలు ముగిసిన మరుసటి రోజు) ముసాయిదా విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాల స్వీకరణకు 30 రోజుల గడువుఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలనుంచి అభ్యంతరాల స్వీకరణ గడువు వచ్చే నెల సెప్టెంబర్ 23తో ముగిసాక, తుది నోటిఫికేషన్ 25న విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత 15 రోజుల వ్యవధిలో (అక్టోబర్ 10 దసరానుంచి ) కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఈ ప్రక్రియకంటే ముందు ఈనెల 17న ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఆ రోజు జరిగే కీలక సమావేశంలోనే కొత్త జిల్లాలకు కావాల్సిన వౌలిక వసతి సౌకర్యాలు, అధికారులు, ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఇదే కీలక సమావేశం. ఆ సమావేశంలో భూపరిపాలన, రెవిన్యూ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్లు పాల్గొంటారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ అధికారిక నివేదికపై రాజకీయపరమైన ఆమోదం కోసం రెవిన్యూ మంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘంతో మరో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ ఉప సంఘం ఈనెల 12న మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, 13న కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, 14న మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధుల ఎదుట మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు ముందుంచింది. వరంగల్ జిల్లాలో జనగామ, మహమూబ్‌నగర్ జిల్లాలో గద్వాలను జిల్లా చేయాలన్న డిమాండ్ తప్ప మిగతా వాటికి ప్రజా ప్రతినిధుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటుకు తగినంత భౌగోళిక విస్థీర్ణం లేదని, పైగా గద్వాల కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో మంత్రివర్గ ఉపసంఘం తిరస్కరించినట్టు సమాచారం. అలాగే జనగామ జిల్లాలో చేరేందుకు ఏ నియోజకవర్గ ప్రజలూ ఆసక్తి కనబర్చడం లేదని, పైగా ఒకవైపు యాదాద్రి, మరోవైపు సిద్ధిపేట జిల్లాలు ఏర్పాటవుతుండటం వల్ల జిల్లాకు సరిపడే విస్తీర్ణం లేదని మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడు ఒకరు తెలిపారు. దీంతో అధికారులు ప్రతిపాదించిన మేరకే 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదిస్తూ ఈనెల 20 ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం.