రాష్ట్రీయం

బతుకు బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ తెలంగాణ సఖ్యతతో వ్యవహరిస్తోందని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహాన్ని కోరుతున్నామన్నారు. పోరాట తెలంగాణను ఇక బతుకు తెలంగాణగా మలిచేందుకు త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ దసరా నుంచే కొత్త జిల్లాల ఆవిర్భావాన్ని ప్రకటించారు. అరాచక శక్తుల ఆటకట్టించి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మీ కళ్లముందే ఉన్నాయన్నారు. తెలంగాణ పోలీసు పనితీరు గణనీయంగా మెరుగుపడిందని చెప్పడానికి జాతీయ పతకాల సాధనలో సింహభాగం తెలంగాణకు దక్కడాన్ని ఉదహరించవచ్చన్నారు. జాతీయ అత్యున్నత పోలీసు శౌర్య చక్ర అవార్డు సమైక్యాంధ్ర చరిత్రలోనే ఎవరికీ దక్కలేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణ బిడ్డ నల్లగొండ జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కుక్కడపు శ్రీనివాసులుకు లభించిందన్నారు. 38వ జాతీయ పోలీస్ మెడల్స్‌తో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు ప్రదర్శిస్తున్న సాహసం, చొరవకు యావత్ జాతి గర్విస్తోందని ప్రశంసించారు. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌తో సయోధ్య సాధించామన్నారు. చత్తీస్‌గఢ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ నాలుగు నెలల్లో రానున్నదన్నారు. గోదావరిపై మహారాష్టత్రో ఈనెల 23న ఒప్పందం కుదురుతుందన్నారు. కర్నాటకతో స్నేహ సంబంధాలు బలపడ్డాయని, దీనివల్ల మహబూబ్‌నగర్‌కు సాగునీరు అందించే ఆర్‌డిఎస్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కర్నాటక ముందుకొచ్చిందన్నారు. మిషన్ భగీరథను గజ్వేల్‌లో ప్రధాని ప్రారంభించారని, ఇంటింటికి మంచినీటితోపాటు ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ ద్వారా ఇంటర్‌నెట్ అందించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కేంద్రం పెట్టుబడులు ఉపసంహరిస్తుంటే, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్‌ను తిరిగి తెరిపించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. నిజానికి ఇది ఏటికి ఏదురీదడమే అయినా, పట్టువీడని ప్రయత్నంతో సాధించామన్నారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. రాష్ట్రావిర్భావానికి ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే, గత రెండేళ్లలో మరో 1951 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మంజూరైందన్నారు. ఏటా 30 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేయగా, 230 గురుకుల పాఠశాలలు పూరె్తై విద్యా బోధన సాగుతోందన్నారు. మరో 20 గురుకుల పాఠశాలలు త్వరలోనే ప్రారంభమవుతాయంటూ, బీసీలకూ మరో 20 గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 40 లక్షల మంది చదువుకునే పిల్లలకు సన్న బియ్యంతో మధ్యాహ్నా భోజనం పెడుతున్నామన్నారు. బ్రాహ్మణులకు బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించామని, త్వరలోనే వారి అభివృద్ధి, సంక్షేమానికి తగిన పథకాలు రూపొందించనున్నట్టు సిఎం వెల్లడించారు. ప్రజలకు దసరా కానుకగా కొత్త జిల్లాలు ఆ రోజునుంచే ఏర్పాటవుతాయన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టులు నిర్మించడమే లక్ష్యమన్నారు. కాళేశ్వరం, పాలమూరు, శ్రీసీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్టు చెప్పారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సిఎం వెల్లడించారు. గతంలో ప్రకటించిన విధంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించామన్నారు. విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. మార్చి 2018 నాటికి మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద పూడిక తీసిన 20వేల చెరువులు నీటితో కళకళలాడుతున్నాని కెసిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు, 40 డయాగ్నటిక్ సెంటర్లు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆసత్రి నిర్వాహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
టిఎస్‌ఐపాస్ పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడిదారులు తెలంగాణపై ఆసక్తి చూపుతున్నానరని, ఇప్పటి వరకు 2300 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటివల్ల 46వేల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని, లక్షా 75 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 13.26 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. లక్ష ఉద్యోగాల సాధనలో భాగంగా ఇప్పటి వరకు 37 వేల ఉద్యోగ నియామకాలు జరిపామన్నారు. 33 శాతం అడవులు పెంచడానికి చేస్తున్న కృషిని కెసిఆర్ వివరించారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజా బలమే అండగా భావించి స్థిరంగా పురోగతి సాధిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవను అందించిన వారికి, ప్రతిభావంతులకు సిఎం కెసిఆర్ అవార్డులు ప్రకటించారు.

చిత్రం.. గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఎం కెసిఆర్