రాష్ట్రీయం

అనుచరుడు సమీరుద్దీన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన సమీరుద్దీన్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వనస్థలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని తుల్జ్భావాని నగర్‌లో పట్టుబడిన నరుూం డ్రైవర్ శ్రీధర్‌గౌడ్‌ను విచారించగా, అతడు ఇచ్చిన సమాచారం మేరకు నల్గొండలో నివాసముంటున్న సమీరుద్దీన్ (26)ను సోమవారం వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సమీరుద్దీన్‌ను జుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా సమీరుద్దీన్‌ను రెండు రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నరుూం అనుచరుల్లో అత్యంత కీలక వ్యక్తిగా సమీరుద్దీన్‌ను గుర్తించారు. భూ దందా, సెటిల్‌మెంట్ కేసుల్లో సమీరుద్దీన్ కీలక పాత్ర పోషించేవాడు. ఇతనిపై నల్గొండలో ఎనిమిది కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వనస్థలిపురంలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో సమీరుద్దీన్ 6ఏ నిందితుడని పోలీసులు తెలిపారు.