రాష్ట్రీయం

ఫిర్యాదుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: గ్యాంగ్ స్టర్ నయిమ్ బాధితులతోపాటు భూతగాదాలకు సంబంధించిన సమస్యలపై న్యాయం చేయాలని కోరుతూ పలువురు మంగళవారం సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్‌ను కలిసి పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాలను అందచేశారు. ఎల్‌బినగర్ క్యాంప్ కార్యాలయానికి ప్రతి మంగళవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిషనర్‌ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. హయత్‌నగర్ డివిజన్ ఆటోనగర్ ద్వారకామయినగర్ కాలనీలో 15గజాలకు సంబంధించి తమ సొంత స్థలాన్ని నరుూం ఆక్రమించుకుని కబ్జా చేశారని కమిషనర్‌కు బాధితురాలు దేవకమ్మ ఆమె కూతుళ్లు విమల, ఉమా విన్నపించారు. ఇబ్రహీం పట్నం, ఆదిభట్ల ప్రాంతానికి చెందిన నరుూం బాధితులు మంగళవారం ఎల్‌బినగర్ డిసిపి తప్సీర్ ఇక్బాల్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఆదిభట్ల ప్రాంతానికి చెందిన మల్లమ్మ నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిని 14 ఏళ్ల క్రితం నరుూంతో పాటు ఆయన అనుచరులు సామ సంజీవరెడ్డి, శ్రీహరి.. తమను బెదిరించి దౌర్జన్యంగా రిజిష్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొంది. మరో బాధితుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల పరిదిలో 2006లో నరుూం అనుచరులు బెదిరించి ఎనిమిది ఎకరాల భూమిని దౌర్జన్యంగా రిజిష్ట్రేషన్ చేయించుకున్నారని వివరించారు.

చిత్రం..కమిషనర్ మహేష్ భగవత్‌ని కలిసి సమస్యలను
వినిపిస్తున్న నయామ్ బాధితులు దేవకమ్మ, ఉమ, విమల