రాష్ట్రీయం

శేషన్న కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: నరుూం కేసులో కీలక నిందితుడు శేషన్న కోసం సిట్ ఆధ్వర్యంలో పది బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. భువనగిరికి చెందిన శేషన్న గ్యాంగ్‌స్టర్ నరుూంకు కుడి భుజం. ఈ నిందితుడిని పట్టుకుంటే నయిమ్ పూర్తిసమాచారం వెల్లడవుతుంది. మరో వైపు నరుూం డైరీలో ప్రస్తావించిన పేర్లలో అన్ని కేటగిరీలకు చెందిన వారి పేర్లతో జాబితాను సిట్ సిద్ధం చేస్తోంది. మంగళవారం రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినప్పటి నుంచి అనంతరం జరిగిన పరిణామాలు, నరుూం నేర కార్యకలాపాలు, డైరీలో కీలకాంశాలు, భూదందాలు, మహిళలు, బాలికలపై ఆకృతాలు, పలువురిని హత్య చేసిన ఘటనలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి సిట్ చీఫ్ నాగిరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని నరుూంకేసులో ఆధారాలున్న వారిని వదిలిపెట్టవద్దని డిజిపి సిట్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా సిట్‌కు లభించిన నరుూం డైరీల్లో సీనియర్ ఐపిఎస్‌లు, రిటైర్డు ఐపిఎస్‌లు, పలువురు రాజకీయనేతల పేర్లు ఉన్నందున ఈ కేసు దర్యాప్తుపై తాజా స్థితిని వివరిస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి సిట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. డైరీలో పేర్లను ఆధారాలతో సిద్ధం చేసిన తర్వాత వారికి సిఆర్‌పిసి సెక్షన్ కింద విచారణకు రావాలని హాజరు కావాలని సూత్రప్రాయంగా సిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నెల 8న నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తర్వాత ఇంతవరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కీలకమైన టెక్ మధు నుంచి విలువైన సమాచారాన్ని సేకరించారు. టెక్ మధు అలియాస్ తోట కుమార స్వామి 2005లో లొంగిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, ఒడిశాలోని మావోయిస్టుల కదలికలపై పోలీసులకు కీలకమైన సమాచారం ఇచ్చాడు. అతను ఇచ్చిన సమాచారంతోనే అనేకమంది మావోయిస్టులు ఈ రాష్ట్రాల్లో పోలీసు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. దీంతో పోలీసులతో ఏర్పడిన చనువును ఆసరాగా చేసుకుని నరుూం గ్యాంగులో కీలకమైన వ్యక్తిగా చేరినట్లు పోలీసులు గుర్తించారు. నరుూంకు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చడంలో టెక్ మధు కీలకపాత్ర వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. నరుూంకు చత్తీస్‌గడ్‌లోని రాయిపూర్‌లో కూడా సురక్షితమైన ఇల్లు ఉన్నట్లు టెక్ మధు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నరుూంపై గత వారం రోజులుగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పోలీసు స్టేషన్లకు దాదాపు 200కుపైగా ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో కిడ్నాప్‌కు సంబంధించి 30కు పైగా ఫిర్యాదులు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో నల్లగొండలో, కనగల్ మండలంలో మొత్తం 4 భవనాలు నరుూంకు ఉన్నట్లు సిట్ పోలీసులకు జిల్లాల నుంచి సమాచారం అందింది. భూదందాలు హత్యలు, సెటిల్‌మెంట్లతో సంబంధం ఉన్న నల్లగొండకు జిల్లాకు చెందిన నరుూం అనుచరులు అస్మత్ బేగం, యూనుస్, టి శ్రీను, జహంగీర్, జానీలను పోలీసులు అరెస్టు చేశారు.